CM Revanth Reddy Review Meeting on Mission Bhagiratha : మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులతో సమీక్షించనున్నారు. మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై చర్చించిస్తారు. మిషన్ భగీరథ బిల్లుల్లో గతంలో అవకతవకలు జరిగినట్లు అభియోగాలు వచ్చాయి. వాటిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అన్ని అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఇవాళ కేబినెట్ సబ్‌కమిటీతో కూడా సీఎం సమావేశం కానున్నారు. గృహజ్యోతి, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలపై సమీక్ష జరిపి, పురపాలక, ఆర్డబ్ల్యూఎస్ విభాగాలతో తాగునీటిపై కూడా చర్చించనున్నారు.
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ ఉద్దేశం: సీఎం రేవంత్‌రెడ్డి
'ప్రపంచంతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం - గత పాలకుల మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం'