ETV Bharat / state

పేదల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కించదు: సీఎం రేవంత్​ - CM Revanth On Mahabubabad Rains

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 3:00 PM IST

Updated : Sep 3, 2024, 3:39 PM IST

CM Revanth Tour in Mahabubabad : మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో వరదలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. ఇదివరకే మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామన్న ఆయన, నష్టపోయిన మూడు తండాలవాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.

CM Revanth Review On Floods in Mahabubabad
CM Revanth Tour in Mahabubabad (ETV Bharat)

CM Revanth Review On Floods in Mahabubabad : పేదల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో పర్యటించిన ఆయన, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమని సానుభూతి తెలిపారు.

దాదాపు 30వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అలానే సహాయచర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం చాలావరకు తగ్గించగలిగామని పేర్కొన్నారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ బాధితులను ఆదుకుంటున్నామన్న సీఎం, ప్రజలు బాధల్లో ఉంటే ప్రతిపక్ష నేత ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. గతంలో మానవత్వం లేని వ్యక్తి పదేళ్లు పాలన చేశారని దుయ్యబట్టారు.

ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యం : చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకు ప్రాధాన్యమిస్తామన్న రేవంత్‌, పువ్వాడ ఆక్రమణలు తొలగించాలని హరీశ్​రావు డిమాండ్‌ చేయగలరా అని ప్రశ్నించారు. వరదల నష్టంపై కేంద్రానికి నివేదించడానికి నివేదిక తయారు చేయాలని అధికారుల ఆదేశించినట్లు సీఎం వివరించారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి రూ.2,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం, ప్రధాని స్వయంగా రాష్ట్ర పర్యటనకు రావాలని పిలుపునిచ్చారు.

అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షం తగ్గినందున బురద తొలగించే పనులు అధికారులు ప్రారంభించాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోని బురద తొలగించవచ్చని తెలిపారు. మరోవైపు విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

"మర్రిపెడ మండలానికి చెందిన మూడు తండాలు ఎప్పుడు అధిక వర్షం వచ్చినా, దాని ప్రభావానికి లోనవుతున్నాయి. దీనిపై కలెక్టర్​కు నేను స్పష్టమైన ఆదేశాలిస్తున్నా, ఆ మూడు తండాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఒక కాలనీ తయారు చేసి, వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రతిపాదనలు చేస్తున్నాను."-రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

'ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు - త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ సంస్థ' - CM REVANTH REDDY ON FLOODS

వరద బాధితుల కోసం కదిలిన ఉద్యోగ జేఏసీ - విరాళంగా రూ.130కోట్లు - TELANGANA EMPLOYEES JAC DONATION

Last Updated : Sep 3, 2024, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.