ETV Bharat / state

ఇది వికసిత్​ భారత్​ బడ్జెట్​ కాదు - కుర్చీ బచావో బడ్జెట్ : సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth On Central Budget Funds - CM REVANTH ON CENTRAL BUDGET FUNDS

CM Revanth On Central Budget Funds : కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్‌ భారత్‌ 2047 బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ మొదటి నుంచి తెలంగాణ పట్ల కక్ష చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్‌ ఉందన్న ఆయన, బిహార్, ఏపీని మాత్రమే పట్టించుకున్నారని, ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదని విమర్శించారు.

Union Budget Funds 2024
CM Revanth On Central Budget Funds (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 5:45 PM IST

Updated : Jul 23, 2024, 10:22 PM IST

CM Revanth Reaction To Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌ట్‌లో రాష్ట్ర ప్రస్తావన లేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీ మొదటి నుంచి రాష్ట్రంపై కక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులతో కలిసి ఇప్పటికే 18 సార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేసినా, రాష్ట్రానికి అన్యాయమే చేశారని విమర్శించారు.

రాష్ట్ర ప్రజలు నిర్ణయం వల్లే మోదీ ప్రధాని అయ్యారన్న సీఎం, 35 శాతం ఓట్లు, 8 సీట్లిచ్చిన ప్రజల పట్ల కృతజ్ఞత చూపించలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర హక్కులపై రేపు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్రానికి నిరసన తెలుపుతారని స్పష్టం చేశారు.

"ఈ బడ్జెట్​కు సంబంధించి రేపటి శాసనసభలో పూర్తి స్థాయి చర్చలు పెడతాం. ఎవరు ఎటువైపు ఉన్నారు, విలీనాల ప్రక్రియలో ఎవరు పాల్గొంటున్నారు? చీకటి ఒప్పందాలకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఇవన్నీ కూడా రేపటి శాసనసభలో తెలుస్తుంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్పీకర్​ అనుమతితో ఈ చర్చపై ముందుకు వెళ్తాం. కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సైతం కలిసి రావాలి." - రేవంత్ ​రెడ్డి, ముఖ్యమంత్రి

కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్‌ ఉంది : కేవలం కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్‌ ఉందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. సబ్​ కా సాత్ - సబ్ ​కా వికాస్​ అనేది బోగస్​ నినాదంగా మార్చారని ధ్వజమెత్తారు. ఇది వికసిత్​ భారత్​ బడ్జెట్​ కాదు, కుర్చీ బచావో బడ్జెట్​ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్‌లో బిహార్‌, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులివ్వలేదని సీఎం విమర్శించారు. విభజన చట్టం కేవలం ఏపీకే కాదు తెలంగాణకూ వర్తిస్తుందని వెల్లడించారు. బీజేపీకి ఓట్లు, సీట్లు మాత్రమే కావాలి తప్ప, రాష్ట్రానికి చేసేదేం లేదని మండిపడ్డారు. వికసిత భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే , ఆయన మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

CM Revanth Fires on Union Minister Kishan Reddy : హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులివ్వాలని కోరితే పట్టించుకోలేదని విమర్శించారు. విద్యా, వైద్యం, నీటి పారుదల రంగాలకు ఎలాంటి సహకారం అందించలేదని దుయ్యబట్టారు. ఐటీఐఆర్ కారిడార్‌ను చేపట్టాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తనకు లేఖ రాశారని, అలాంటప్పుడు కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారని సీఎం ప్రశ్నించారు.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్న సీఎం, ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర హక్కులను మోదీ వద్ద తాకట్టు పెట్టారంటూ ఘాటుగా స్పందించారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన తెలుపుతారని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఇది టీడీపీ, జేడీయూను ప్రసన్నం చేసుకునేందుకు పెట్టిన బ‌డ్జెట్ : మంత్రి ఉత్తమ్‌ - Minister Uttam On Union Budget 2024

జులై 31 ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాలి - లేకుంటే జీతాలు ఇవ్వలేం : శ్రీధర్ బాబు

Last Updated : Jul 23, 2024, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.