CM Revanth Reddy paid tribute Mahatma Gandhi : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ నాయకులు, అధికారులు ఘనంగా నివాళి అర్పించారు. గాంధీజీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. గాంధీ వర్ధంతి పురస్కరించుకుని లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్ద సీఎం పుష్పాంజలి ఘటించారు. ఆయనతో పాటు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. సీఎం రేవంత్, గాంధీజీ వర్ధంతికి నివాళులర్పిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామ రక్ష అని అందులో పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్ - ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సుకు అంగీకారం
Minister Sridhar Babu Fire on MLC Kavitha : గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని శాసనసభా ప్రాంగణంలో సభాపతి ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు గాంధీజీకి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది కోసమే పూలే విగ్రహం ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అసెంబ్లీలో పూలే విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీల నియామకం విషయంలో గవర్నర్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలను కించపర్చడం సబబు కాదని పేర్కొన్నారు.
"గవర్నర్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. రాజ్యాంగ వ్యవస్థలను కించపర్చడం సబబు కాదు. పదేళ్లలో అసెంబ్లీలో పూలే విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదు. పూలే విగ్రహం ఏర్పాటుపై కేసీఆర్‌ను కవిత ఎందుకు అడగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది కోసమే పూలే విగ్రహం అంశాన్ని తెరపైకి తెచ్చారు." - రాష్ట్ర శ్రీధర్‌బాబు, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి