ETV Bharat / state

మా పాలనపై నమ్మకంతో చెబుతున్నా - 14 సీట్లు గెలుస్తాం : సీఎం రేవంత్ - CM REVANTH REDDY INTERVIEW LATEST - CM REVANTH REDDY INTERVIEW LATEST

CM Revanth on TS Lok Sabha Polls 2024 : కాంగ్రెస్ పాలనపై నమ్మకంతో చెబుతున్నా, రాష్ట్రంలో 14 లోక్‌సభ సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే పోటీ అని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని, రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

CM Revanth
CM Revanth
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 8:12 AM IST

Updated : Apr 29, 2024, 9:49 AM IST

CM Revanth Reddy Interview Latest 2024 : రాష్ట్రంలో రైతులకు వచ్చే ఆగస్టు నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని, అందుకు తమ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫార్మర్స్‌ వెల్పేర్‌ పేరుతో ఓ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసి అన్నదాతల అప్పులను ప్రభుత్వం బదలాయించుకుంటుందని చెప్పారు. విడతల వారిగా బ్యాంకులకు ప్రభుత్వమే ఆ మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తుందని తెలిపారు. అందుకోసం త్వరలోనే బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతామని రేవంత్‌రెడ్డి వివరించారు.

పదేళ్లలో బీజేపీ చేసిన విధ్వంసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం

CM Revanth Interview With ETV Bharat : రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కల్పిస్తామని రేవంత్‌రెడ్డి ఈటీవి, ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన ఆలోచనలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కరవు, విద్యుత్‌ , రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపణలపై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. దేశంలో తిరిగి బీజేపీ గెలిస్తే జరిగే అనర్థాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

'ఒక సంవత్సరం కడుపు కట్టుకుని అయినా రుణమాఫీ చేసి తీరుతాం - పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు పట్టిన శని వదిలిపోతుంది' - cm Revanth counter to Harish Rao

కరువును కాంగ్రెస్‌కు అంటగట్టడం బీఆర్ఎస్ దివాళా కోరుతనానికి నిదర్శనం

ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించి వందేళ్లు అయిన సందర్భంగా రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలనుకునేవారు హస్తం పార్టీకి ఓటు వేయాలని కోరారు. తాము అధికారం చేపట్టిన కొన్ని నెలలకే పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ వచ్చిందని, ఈ స్వల్పకాలంలో తాము అద్భుతాలు సృష్టించకపోయినా తప్పులు చేయలేదని, ప్రజలను నిరాశపర్చలేదని అన్నారు. ఐదేళ్లు పాలించేందుకు ప్రజలు తీర్పు ఇస్తే మొదటి వంద రోజుల్లోనే గ్యారంటీల అమలుకు చర్యలు తీసుకున్నామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో 14 సీట్లు గెలుస్తాం

ఈ నమ్మకంతోనే పార్లమెంట్‌ ఎన్నికలను తమ పాలనకు ముమ్మాటికీ రిఫరెండంగానే భావించాలని ప్రజలను కోరుతున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. మోదీని దించాలా ఉంచాలా అనేదానిపైనే ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో పోటీ కాంగ్రెస్‌కు, బీజేపీ మధ్యనేనని స్పష్టం చేశారు. బలహీన అభ్యర్థులను నిలిపి కొన్ని నియోజకవర్గాల్లో కమలం పార్టీ విజయానికి బీఆర్ఎస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వచ్చే పదిహేను రోజుల పాటు తమ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాన్ని మరో దశకు తీసుకెళ్లి, 14 సీట్లు గెలుస్తామంటున్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం.

400 సీట్లలో గెలిస్తే, రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ భావిస్తున్నారు : సీఎం రేవంత్​రెడ్డి - lok sabha elections 2024

కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేశారు : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth on Modi and KCR

Last Updated : Apr 29, 2024, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.