CM Revanth On Old Woman House Issue In Vikarabad : వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఇల్లులేక మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్న మల్లమ్మ అనే వృద్ధురాలి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. 8 ఏళ్లుగా అక్కడే జీవనం సాగిస్తున్న మల్లమ్మ దీనస్థితి సీఎం దృష్టికి వెళ్లగా వెంటనే వృద్ధురాలికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లమ్మని పరామర్శించి ఆమె క్షేమం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంటి మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు.
మరుగుదొడ్డే ఇల్లుగా జీవనం సాగిస్తున్న వృద్ధురాలు : వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామంలో మల్లమ్మ అనే వృద్దురాలు గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటుంది. కానీ ఆ వృద్దురాలికు ఇల్లు లేక స్వచ్చభారత్ పథకం ద్వారా వచ్చిన బాత్రూంనే నివాసంగా మలుచుకుంది. అందులోనే తన సామాన్లను పెట్టుకొని అక్కడే వంట వండుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ కూలీ చేసుకుంటూ పూట గడుపుకుంటుంది.
ప్రభుత్వమే ఆదుకోవాలి : ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు బాత్రూంలో నీరు చేరి ఆ వృద్దురాలిని ఇబ్బందులకు గురిచేసింది. ఇంట్లో ఉన్న సామాన్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఆ బాత్రూం కూడా శిథిలావస్తకు చేరడంతో భయపడుతూ జీవనం సాగిస్తోంది. ఆ వృద్దురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వారి భర్తలు చనిపోయారని బాధితురాలు మల్లమ్మ తెలిపారు. వారికి ఉండేందుకు ఇల్లు లేక ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారని వెలల్డించారు. కుమార్తెలు పండుగకు ఇంటికి రావడానికి ఇల్లులేక ఇబ్బందిపడుతున్నారని మల్లమ్మ వాపోయారు. ప్రభుత్వం స్పందించి తనకు ఒక ఇల్లు మంజూరు చేయాలని ప్రాధేయపడ్డారు.
వర్షాలతో కూలిన పెంకుటిల్లు - భార్య మృతి, మరో గదిలో నిద్రించిన భర్త సేఫ్వరద బాధితులకు ఈనాడు ఆపన్నహస్తం - సూర్యాపేటలో నిత్యావసరాల పంపిణీ - EENADU HELPS FLOOD VICTIMS