ETV Bharat / state

నగర బ్రాండ్​ పెంపే లక్ష్యంగా సర్కార్​ అడుగులు - హైదరాబాద్​కు విదేశీ వర్సిటీలు? - GOVT FOCUS ON FOREIGN UNIVERSITIES

రాష్ట్రంలో విదేశీ వర్సిటీల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ - తెలంగాణలో ప్రాంగణం ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్న లింకన్​ వర్సిటీ

Govt Focus To Invite Foreign Universities
Govt Focus To Invite Foreign Universities (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 8:32 AM IST

Govt Focus To Invite Foreign Universities : ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలకు హబ్​గా మారిన భాగ్యనగరానికి ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక్క విదేశీ యూనివర్సిటీనైనా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించాలని, తద్వారా ఇక్కడి విద్యార్థులకు అత్యుత్తమ అవకాశాలు కల్పించడంతోపాటు నగర బ్రాండ్‌ను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల విదేశీ పర్యటనలో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ, యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యాజమాన్యాలతో సమావేశమై హైదరాబాద్‌లో క్యాంపస్‌లను నెలకొల్పాలని ఆహ్వానించారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలని, అందుకోసం టాప్‌ వర్సిటీల యాజమాన్యాలతో మాట్లాడి క్యాంపస్‌లు ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.

గత నవంబరులోనే కేంద్రం అనుమతి : ఇండియా నుంచి ఏటా 12 లక్షల మంది ఉన్నత విద్య కోసం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, జర్మనీ తదితర దేశాలకు వెళుతున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. ఈ క్రమంలో విదేశీ యూనివర్సిటీల ప్రాంగణాలను దేశంలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2023 నవంబరులోనే అనుమతిచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్‌ 500 వర్సిటీలు యూజీసీకి దరఖాస్తు చేసుకోవచ్చని అవకాశం కల్పించింది. దీంతో దాదాపు 10కిపైగా విశ్వవిద్యాలయాలు దరఖాస్తు చేసుకున్నట్లు యూజీసీ వర్గాల సమాచారం.

Foreign Universities In India : ఆస్ట్రేలియాకు చెందిన డైకిన్‌ వర్సిటీ అహ్మదాబాద్‌లోని గిఫ్ట్‌ సిటీలో క్యాంపస్‌ ఏర్పాటుకు యూజీసీ (విశ్వవిద్యాలయ నిధుల సంఘం) నుంచి అనుమతి పొందింది. అక్కడ ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లోనే తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంగణంలో సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో పీజీ కోర్సుకు 3,500 దరఖాస్తులు రావడం విశేషం.

మన దేశంలో ప్రాంగణాన్ని ప్రారంభించిన తొలి విదేశీ వర్సిటీగా ఈ వర్సిటీ గుర్తింపుపొందింది. తాజాగా యూకేకు చెందిన సౌతాంప్టన్‌ యూనివర్సిటీ గురుగ్రామ్‌లో క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు యూజీసీ నుంచి ప్రాథమిక అనుమతి (ఎల్‌ఓఐ) పొందింది. మలేసియా, కెనడా యూనివర్సిటీలు సైతం దరఖాస్తు చేసి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి.

రాష్ట్రంలో విదేశీ వర్సిటీ : రాష్ట్రంలో ప్రాంగణం ఏర్పాటుకు మలేసియాకు చెందిన లింకన్‌ వర్సిటీ కొద్ది నెలల క్రితమే యూజీసీకి దరఖాస్తు చేసుకుంది. ఇది క్యూఎస్‌ వరల్డ్​ ర్యాంకింగ్‌లో 301-340 పరిధిలో ఉంది. యూజీసీ ఇంకా దీనికి అనుమతివ్వలేదు. ఆ వర్సిటీని హైదరాబాద్‌ శివార్లలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

ఐఐటీ, ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐఎస్‌బీ), బిట్స్‌ పిలానీ క్యాంపస్, నల్సార్ , సెంట్రల్‌ వర్సిటీలతో ఇప్పటికే హైదరాబాద్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారింది. స్కిల్‌ యూనివర్సిటీకి ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికితోడు ప్రపంచస్థాయి వర్సిటీల ప్రాంగణాలు సైతం ఏర్పాటైతే హైదరాబాద్‌ అంతర్జాతీయ నగరంగా ఎదగడానికి దోహదపడతాయని సర్కారు భావిస్తోంది.

స్కిల్​ వర్సిటీ కోసం కార్పస్​ ఫండ్​కు రేవంత్​ పిలుపు - రాష్ట్రం తరఫున రూ.100 కోట్లు

'అసెంబ్లీ సమావేశాల్లోగా స్కిల్​ వర్సిటీ ఏర్పాటుకు పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయండి' - CM Revanth on Skill University

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.