ETV Bharat / state

'ప్రైవేట్ స్కూళ్లలో మీకంటే అనుభవజ్ఞులు ఉన్నారా ?' - డీఎస్సీ విజేతలతో సీఎం రేవంత్ - TELANGANA TEACHER JOB APPOINTMENTS

90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేసి నియామకపత్రాలు ఇచ్చామన్న సీఎం రేవంత్​ రెడ్డి - డీఎస్సీ ద్వారా 65 రోజుల్లో 10,006 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేశామని ప్రకటన

CM Revanth Reddy to distribute job appointment documents to teachers
CM Revanth Reddy to distribute job appointment documents to teachers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 5:36 PM IST

Updated : Oct 9, 2024, 7:20 PM IST

CM Revanth Distribute Teacher Job Appointments Letters : డీఎస్సీ విజేతలను చూస్తే దసరా ముందే వచ్చినట్లు అనిపిస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలి దానాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని అందరూ ఆశించారని తెలిపారు. గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన మూడేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్​ ఇచ్చారని ధ్వజమెత్తారు. గతంలో నోటిఫికేషన్​ ఇచ్చిన రెండేళ్లకు నియామక ప్రక్రియ పూర్తయిందని విమర్శించారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో టీచర్లకు ఉద్యోగ నియామకపత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్​ పాల్గొన్నారు. టీచర్లకు నియామక పత్రాలను సీఎం రేవంత్​ రెడ్డి అందజేశారు.

నియామక పత్రాలు పంపిణీకి ముందు సీఎం మాట్లాడుతూ, 'గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు, కవిత ఉద్యోగాలు ఊడాలని గతంలో చెప్పాను. కాంగ్రెస్​ ప్రభుత్వం రావాలని నిరుద్యోగులు బాధ్యత తీసుకున్నారు. 90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేసి నియామకపత్రాలు ఇచ్చాం. డీఎస్సీ ద్వారా 65 రోజుల్లో 10,006 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేశాం. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రబుత్వ పాఠశాలల పాత్ర కీలకం. గతంలో విద్యాశాఖలో బదిలీలు, పదోన్నతులు లేవు. విద్యాశాఖ నా దగ్గరే ఉంది సమస్యలు పరిష్కరించాం.' అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.

"విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తాం. రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది విద్యార్థులు ఇంజినీర్లు పట్టాలు పొందుతున్నారు. నైపుణ్యాలు పెంపొందించేందుకు యంగ్​ ఇండియా స్కిల్​ వర్సిటీను ప్రారంభించాం. యంగ్​ ఇండియా స్కిల్​ వర్సిటీ ద్వారా సాంకేతిక నైపుణ్యం అందిస్తున్నాం. ఒలింపిక్స్​లో దేశం పరిస్థితి ఏంటో చూశాం. 4 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియాకు ఒలింపిక్స్​లో 32 పతకాలు వచ్చాయి. 140 కోట్ల జనాభా ఉన్న భారత్​కు ఒలింపిక్స్​లో ఎందుకు పతకాలు రాలేదు." - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

టీచర్లే తెలంగాణ వారధులు, నిర్మాతలు : డీఎస్సీ నోటిఫికేషన్​ను అడ్డుకోవాలని కొరివి దెయ్యాలు యత్నించాయని సీఎం రేవంత్​ విమర్శించారు. కేసులు వేసి డీఎస్సీ నోటిఫికేషన్​ను అడ్డుకోవాలని కుట్రలు చేశారన్నారు. తెలంగాణ నిర్మాణంలో టీచర్లు భవిష్యత్​ తరాలకు ఆదర్శంగా మారబోతున్నారని తెలిపారు. డీఎస్సీ విజేతల సంతోషాన్ని చూసి కొందరు కళ్లల్లో కారం పెట్టుకుంటారని ధ్వజమెత్తారు. టీచర్లే తెలంగాణ వారధులు, నిర్మాతలు అని కొనియాడారు. పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చే బాధ్యత టీచర్లదేనంటూ బాధ్యత అప్పగించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేరు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్లకంటే అనుభవజ్ఞులు ఉన్నారా?. అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్లు ప్రారంభించాం. ఈ నెల 11న వాటికి శ్రీకారం చుట్టబోతున్నాం. బడ్జెట్​లో విద్యుకు రూ.25 వేలు కోట్లు కేటాయించాం. ఐటీఐలను అడ్వాన్స్​ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరిస్తున్నాం - రేవంత్​ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

అప్పుడు వార సంతల్లో దుస్తులు అమ్మి - ఇప్పుడు జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్​తో టీచర్ కొలువు - Garment Seller Select for DSC

ఆ ఫ్యామిలీలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే - డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన తండ్రీకుమారులు - Father and Son Selected in DSC

Last Updated : Oct 9, 2024, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.