ETV Bharat / state

అశ్రునయనాల మధ్య లాస్య నందిత అంత్యక్రియలు - లాస్య నందిత మృతిపై రేవంత్‌ నివాళి

CM Revanth Reddy Condolences to Lasya Death : రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందితకు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. మారేడుపల్లి శ్మశానవాటికలో అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు లాస్య నందిత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు.

funeral procession of Lasyanandita
CM Revanth Reddy Condolences to Lasya Death
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 7:27 PM IST

Updated : Feb 23, 2024, 9:36 PM IST

అశ్రునయనాల మధ్య లాస్య నందిత అంత్యక్రియలు

CM Revanth Reddy Condolences to Lasya Death : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు(Lasya Death) మారేడుపల్లి శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, స్థానికులు, వివిధ పార్టీల నేతల నేతలు ఈ అంతిమ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాస్య నందిత నివాసం నుంచి భారీ ర్యాలీగా అంతిమయాత్ర సాగింది.

బీఆర్​ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని తమ భుజాలపై మోసుకుంటూ వాహనంలోకి చేర్చారు. ఆ తరువాత అంతిమయాత్ర భారీ జనసందోహం మధ్య మారేడుపల్లి శ్మశాన వాటిక వద్దకు సాగింది. అక్కడ కుటుంబ సభ్యులు అంతిక సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు గౌరవసూచకంగా తుపాకులు పేల్చారు.

అంతకు ముందు దివంగత ఎమ్మెల్యే భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth) నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌ కార్ఖానాలోని లాస్య నివాసానికి వెళ్లిన సీఎం, ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా లాస్య భౌతకకాయానికి నివాళి అర్పించారు. నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న రేవంత్‌, ఆమె తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.

యువనాయకురాలు లాస్య నందిత మృతిపై ప్రముఖుల సంతాపం

Cantonment MLA Lasya Nandita Dead : కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయిన లాస్య నందిని గురువారం అర్ధరాత్రి సదాశివపేటకు కుటుంబం సహా వెళ్లారు. అనంతరం తెల్లవారుజామున శామీర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కిన నందిత వాహనం, పటాన్‌చెరు వెళ్తుండగా ముందు ఉన్న టిప్పర్‌ను ఢీకొని నియంత్రణ కోల్పోయి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోగా, వాహనం నడుపుతున్న పీఏ ఆకాశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, ముందువైపు ఉన్న ఎడమ చక్రం విడిపోయింది.

ప్రమాదం జరిగిందిలా.. మరోవైపు లాస్య నందిత కారు డ్రైవర్‌ ఆకాశ్‌పై కేసు నమోదయ్యింది. కారు ప్రమాదం ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు వివరాలను వెల్లడించారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడం వల్ల ప్రమాదం జరిగిందని సంగారెడ్డి ఎస్పీ పేర్కొన్నారు. గురువారం సదాశివపేటకు వెళ్లి వచ్చిన లాస్య నందిత ఈరోజు ఉదయం అల్పాహారం కోసమని ఇంటి నుంచి బయల్దేరారని, శామీర్‌పేట వద్ద కారు ఓఆర్‌ఆర్‌ పైకి వచ్చిందన్నారు. మరి కొద్దిసేపట్లో ఓఆర్‌ఆర్‌ నుంచి ఎగ్జిట్‌ అవుదామనుకున్న సమయంలో సుల్తాన్‌పూర్‌ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తోన్న టిప్పర్‌ను ఢీకొందని, ఆపై నియంత్రణ కోల్పోయి రెయిలింగ్‌ను ఢీకొట్టిందన్నారు. తలకు బలమైన గాయం, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ వల్లే లాస్య నందిత చనిపోయినట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారన్నారు.

అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు - ఏర్పాట్లకు హైదరాబాద్‌ కలెక్టర్‌కు ఆదేశాలు

కబళించిన మృత్యువు - లాస్య నందితకు కలిసి రాని 'ఎమ్మెల్యే' కాలం

Last Updated : Feb 23, 2024, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.