ETV Bharat / state

గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్​ కాదు - వాస్తవిక బడ్జెట్ : సీఎం రేవంత్​ - cm revanth reddy

CM Revanth Reddy Chit Chat On Telangana Budget : గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్​ కాకుండా వాస్తవిక బడ్జెట్​ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్​లో సీఎం చిట్​చాట్​ నిర్వహించారు.

Telangana Budget
CM Revanth Reddy Chit Chat On Telangana Budget
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 2:52 PM IST

Updated : Feb 10, 2024, 3:16 PM IST

CM Revanth Reddy Chit Chat On Telangana Budget : గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్​ ప్రవేశపెట్టకుండా వాస్తవిక బడ్జెట్​(Telangana Budget) ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తెలిపారు. తమ ఎమ్మెల్యేలనే కాదు, ప్రతిపక్షాలనూ మేడిగడ్డకు తీసుకెళతామని స్పష్టం చేశారు. అనంతరం మేడిగడ్డ అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులపై న్యాయ విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చిట్​చాట్​ నిర్వహించారు.

మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగిబాటుపై విజిలెన్స్​ విచారణలో ప్రాథమికంగా చర్యలు తీసుకున్నామని, జ్యూడీషియల్​ విచారణ తర్వాతనే ఈ విషయంపై ముందుకెళతామని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. అలాగే సచివాలయం, అమరవీరుల స్తూపం, అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాట్లపై విచారణ జరిపిస్తామని అన్నారు. నిధులు కేటాయింపు, వ్యయాలపై కూడా విచారణ చేస్తామని పేర్కొన్నారు.

CM Revanth Reddy Chit Chat : ఆర్థిక మంత్రి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే బడ్జెట్​ను ప్రవేశపెట్టారని సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తాను అభినందిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చినా తీసుకుంటామని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. కేంద్రాన్ని అదనంగా అడిగి కూడా నిధులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు పొడిగింపు తన చేతిలో లేదని సీఎం అన్నారు. ఈ విషయంలో స్పీకర్​ నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు.

ఎమ్మెల్యేల చేరిక విషయం జగ్గారెడ్డినే అడగండి : మా పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకు వస్తే కలుపుకుని పోతామని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో తాను తెలంగాణ భాషనే మాట్లాడుతున్నానన్నారు. బీఆర్​ఎస్​కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తారని జగ్గారెడ్డి అంటున్నారని తెలిపారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేరిక గురించి ఆయననే అడగాలని చెప్పారు.

Telangana Budget 2024-25 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్​ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను రూ.2.75 లక్షల కోట్లతో ప్రవేశపెట్టి, ఏఏ శాఖకు ఎంత మొత్తం కేటాయిస్తున్నారో స్పష్టంగా చెప్పారు. అత్యధికంగా కాంగ్రెస్​ పార్టీ ఆరు గ్యారంటీలకు బడ్జెట్​లో కేటాయింపులు ఎక్కువగా జరిగాయి. ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లను బడ్జెట్​లో కేటాయించారు.

రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?

ఆరు గ్యారంటీలకే బడ్జెట్​లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?

Last Updated : Feb 10, 2024, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.