CM Revanth Clarified the Ration Card Provision for Loan Waiver : పంట రుణాల మాఫీ విషయంలో రేషన్‌కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. భూమి పాస్‌బుక్ ఆధారంగానే రూ.2లక్షల రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్‌కార్డు నిబంధన పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలో కలెక్టర్ల సమీక్షా సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు.
ఈనెల 18న రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ : ఎల్లుండి సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో రూ.లక్ష వరకు డబ్బులు జమ కానున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈనెల 18న రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రాష్ట్రంలో పంట రుణమాఫీకి కాంగ్రెస్ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఆర్డర్స్ (జీవో ఆర్టీ నంబరు 567) జారీ చేసింది. ఒక రైతు కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసేందుకు నిశ్చయించుకుంది. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్లరేషన్ కార్డును కంపల్సరీగా తీసుకోనున్నట్లు ప్రకటించింది.
విపక్షాల విమర్శలపై సీఎం స్పష్టత : అన్ని షెడ్యూల్డు, వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ, జిల్లా కోపరేటివ్ బ్యాంకుల నుంచి 2018 డిసెంబరు 12 నుంచి మంజూరైన, రెన్యువలైన రుణాలకు, 2023 డిసెంబరు 9 వరకు బకాయి ఉన్న పంట లోన్స్‌కు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని రుణాల అసలు, దానికి వర్తించే వడ్డీని కలిపి రూ.2 లక్షలు మాఫీ అవుతాయని రేవంత్ సర్కార్ తెలిపింది. అయితే తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్టు ప్రకటించటంతో విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు.
CM Revanth on Farmer Loan Waiver Scheme : అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికి ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.
ఇప్పుడు ప్రజా ప్రభుత్వం పాలనలో తెలంగాణ రైతాంగానికి, కష్టమైనా భారమైనా ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆగష్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని, ఇది రైతన్నకు మీ రేవంతన్న మాట అంటూ సీఎం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి…
— Revanth Reddy (@revanth_anumula) July 16, 2024
ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే…
ఒక బృహత్తర సాహసం…
“రైతు రుణమాఫీ పథకం”
నాడు శ్రీ మన్మోహన్ సింగ్ సారథ్యంలో
దేశ రైతాంగానికైనా…
నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో
రాష్ట్ర రైతాంగానికైనా…
ఎంత కష్టమైనా…
ఎంత భారమైనా…
ఏకకాలంలో రుణమాఫీ…
చేసిన……
రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దు : సీఎం రేవంత్ - TG Digital Health Profile Card