ETV Bharat / state

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి - బీ ఫామ్ అందజేసిన సీఎం రేవంత్​రెడ్డి - Mahabubnagar Congress MLC Candidate

Mahabubnagar Congress MLC Candidate 2024 : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్‌రెడ్డిని హస్తం పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనకు బీ ఫామ్‌ను అందజేశారు. తనకు బీ ఫామ్‌ అందజేసిన రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Etv BharatCM Revanth Reddy Give B form to Manne Jeevan Reddy

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 6:38 PM IST

Mahabubnagar Congress MLC Candidate 2024 : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు హస్తం పార్టీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు పార్టీ బీ ఫామ్‌ను అందించారు. జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను రేవంత్‌రెడ్డి కోరారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు.

Mahabubnagar MLC Candidate 2024 : అనేక మంది ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అందుకే పార్టీలకు అతీతంగా వారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వివరించారు. తనకు బీ ఫామ్‌ అందజేసిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో తాను ఘనవిజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి కృషి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆయన కోరారు. సోమవారం ఉదయం 11:00 గంటలకు జిల్లా కేంద్రంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జీవన్‌రెడ్డి వెల్లడించారు.

మాది మాటల సర్కార్ కాదు - చేతల సర్కార్ - కాంగ్రెస్‌పై బీఆర్​ఎస్​ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి : మంత్రులు

ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన జీవన్‌రెడ్డి : ఇటీవలే మన్నె జీవన్‌రెడ్డి (Manne Jeevan Reddy) హస్తం పార్టీలో చేరారు. ఆయన బాబాయి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి నుంచి మహబూబ్‌నగర్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామం జీవన్‌రెడ్డి స్వస్థలం. ఆయన ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Congress MLC Candidate Manne Jeevan Reddy : ఇప్పటికే బీఆర్ఎస్ తమపార్టీ అభ్యర్థిగా నవీన్‌కుమార్‌రెడ్డి (Naveen Kumar Reddy)పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా ఖరారు కావడంతో ఈ స్థానానికి పోటీ అనివార్యమైంది. ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నామినేషన్లు సమర్పించడానికి ఈనెల 11 ఆఖరి రోజు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం ఒక్కరోజే నామినేషన్లకు అవకాశం ఉంది. 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణకు గడువు ఉంది. ఈనెల 28న పోలింగ్‌ ఉండగా, ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

రూ.50 వేల కోట్లతో లండన్ థేమ్స్ రివర్ తరహాలో మూసీ నది డెవలప్​మెంట్ : సీఎం రేవంత్ ​రెడ్డి

మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పూర్వ మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పురపాలిక కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉండనున్నారు. 2021లో 1,445 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల పదవీ కాలం ముగియకపోవడం వల్ల ప్రస్తుతం వారే ఓటర్లుగా ఉంటారు.

మజ్లిస్, కాంగ్రెస్ మధ్య సయోధ్య - చేతిలోన చెయ్యేసి సర్కార్‌కు ఒవైసీ భరోసా!

'కేంద్రంతో బేషజాలకు వెళ్లం - అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్‌ అభివృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.