ETV Bharat / state

ఈనెల 27న సాయంత్రం రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం : రేవంత్ రెడ్డి - Revanth Announce Date on Gas Scheme

CM Revanth Announce Date on Gas, Electricity Schemes : ఈనెల 27న సాయంత్రం మరో రెండు గ్యారంటీలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడారం జాతరలో ప్రకటన చేశారు. ఉచిత కరెంట్​, రూ.500 గ్యాస్ సిలిండర్​ పథకం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు.

Congress Six Guarantees in Telangana
CM Revanth Announce Date on Gas, Electricity Schemes
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 3:20 PM IST

Updated : Feb 23, 2024, 5:00 PM IST

CM Revanth Announce Date on Gas, Electricity Schemes : కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం(Gruha Jyoti Scheme) కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఆయన వెల్లడించారు. ఈ రెండు​ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్​ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు.

ఈనెల 27న సాయంత్రం రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం : రేవంత్ రెడ్డి

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా : సీఎం రేవంత్‌రెడ్డి

మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని రేవంత్ దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Project) దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపామన్న ఆయన, కేసీఆర్‌ కళ్లు మూసుకుని ఫాంహౌస్‌లో ఉండడం వల్లే ఏపీ సీఎం కృష్ణా జలాలను తరలించుకుపోయారని విమర్శించారు.

"ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను 27వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నాం. ప్రధానంగా రూ.500కు సిలిండర్​, తెల్ల రేషన్​ ఉన్న ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే​ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకాబోతున్నారు."-రేవంత్ రెడ్డి, సీఎం

Congress Guarantees Implementation in Telangana : విద్యుత్‌ విషయంలో గత ప్రభుత్వ తప్పులను ప్రజల ముందు ఉంచామన్న సీఎం పేర్కొన్నారు. అదేవిధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలో శుభవార్త చెబుతామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత తమదన్నారు. ఉద్యోగులకు తాము అధికారంలోకి వచ్చిన మొదటి నెల 4వ తేదీనే జీతాలు ఇచ్చామన్న ఆయన, ఈనెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో ప్రెస్‌ అకాడమీ(Press Academy) ఛైర్మన్‌ను నియమిస్తున్నట్లు, అలానే త్వరలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ఏపీపై ఓ కన్నేసి ఉంచండి - వేస‌విలో తాగునీటి సమస్య రావొద్దు : సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Comments on KCR : 60 ఏళ్ల సమైక్య పాలనలో జరగనంత దోపిడీ పదేళ్ల కేసీఆర్‌ పాలనలో జరిగిందని నిట్టూర్చారు. దశాబ్ద కాలం పాటు కేసీఆర్ దోపిడీ చేస్తున్నా మోదీ ఆయన్ని నిలువరించలేదన్నారు. ఇప్పుడు మాత్రం రాష్ట్ర బీజేపీ నేతలు,(BJP leaders) కేసీఆర్‌ అవినీతిపై సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నారని ఆక్షేపించారు. సీబీఐ, ఈడీ & ఐటీ, బీజేపీ చేతిలో ఉన్నా కేసీఆర్‌పై ఒక్క కేసు పెట్టలేదెందుకని సీఎం ప్రశ్నించారు.

కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టలేదన్న ఆయన, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేపదే కేంద్రానికి ఫిర్యాదు చేసినా పట్టించుకులేదని ఆరోపించారు. తాము న్యాయ విచారణ నిర్ణయం తీసుకున్న తర్వాత కమలదళం సీబీఐ విచారణ(CBI investigation) కోరుతోందని అన్నారు. కేసీఆర్‌ దోపిడీలో వాటా కోసమే బీజేపీ సీబీఐ విచారణ కోరుతోందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిపై త్వరలో విశ్రాంత హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరుగుతుందన్నారు.

విద్యుత్‌ కోతలు విధిస్తే సస్పెండ్‌ చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

ఇంకా యుద్ధం ముగియలేదు - ఇది విరామం మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

Last Updated : Feb 23, 2024, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.