ETV Bharat / state

దండి కుటీర్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు - CM Chandrababu Visit Dandi Kutir - CM CHANDRABABU VISIT DANDI KUTIR

గుజరాత్‌లోని గాంధీనగర్‌ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు జాతిపిత మహాత్మాగాంధీ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన 'దండి కుటీర్‌'ను సందర్శించారు. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులపై సదస్సు సందర్భంగా దండి కుటీర్‌ను సందర్శించాల్సిందిగా చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. భావితరాలు స్ఫూర్తిదాయకమైన, విలువలతో కూడిన జీవితాన్ని గడిపేలా మార్గదర్శనం చేసేలా దండి కుటీర్‌ను నిర్మించిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

CM Chandrababu Visit Dandi Kutir
CM Chandrababu Visit Dandi Kutir (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 10:01 AM IST

CM Chandrababu Visit Dandi Kutir : జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్​ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ - 2024లో పాల్గొనేందుకు గుజరాత్​లోని గాంధీనగర్​కు వెళ్లిన సీఎంను దండి కుటీర్​ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

మహాత్మా గాంధీ జీవిత విశేషాలను అత్యాధునిక టెక్నాలజీతో, అరుదైన చిత్రాలతో ఏర్పాటు చేశారు. దండి కుటీర్ గురించి ప్రధాని మోదీ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అనంతరం సందర్శించి కాసేపు అక్కడ గడిపారు. గాంధీజీని స్మరించుకుని నివాళులు అర్పించారు. దండి కుటీర్ సందర్శన తన జీవితంలో మరపురాని ఘటనగా గుర్తిండి పోతుందని అన్నారు. గాంధీజీ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా దండి కుటీర్ ఉందని అభిప్రాయపడ్డారు. గాంధీజీ తన జీవితం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశాన్ని వివిధ చిత్రాలు, దృశ్యశ్రవణ విధానంలో ప్రదర్శించిన తీరును మెచ్చుకున్నారు.

దండి కుటీర్‌ను సందర్శించడం అద్భుతమైన అనుభవమని చంద్రబాబు తెలిపారు. దీన్ని చాలా వినూత్నంగా, విజ్ఞానదాయకంగా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దారని కొనియాడారు. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల గురించి భవిష్యత్‌ తరాలకు తెలియజెప్పే అద్భుతమైన ప్రాంతంమని, ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఏర్పాటైన దండి కుటీర్‌ను సందర్శించడం తన అదృష్టమని అన్నారు. భావితరాలు స్ఫూర్తిదాయకమైన, విలువలతో కూడిన జీవితాన్ని గడిపేలా మార్గదర్శనం చేసేలా దండి కుటీర్‌ను నిర్మించిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాలను సీఎం చంద్రబాబు రాశారు.

ప్రభుత్వ పాలసీలపై గుజరాత్ సీఎంతో చర్చలు : అనంతరం సీఎం చంద్రబాబు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో తేనేటి విందుకు హాజరయ్యారు. భారతదేశపు రాజకీయాల్లో విజనరీ లీడర్​గా, అభివృద్ధి పాలకుడిగా చంద్రబాబు నాయుడు తనకు ఎప్పటి నుండో స్ఫూర్తిగా ఉన్నారని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కొనియాడారు. భూపేంద్ర పటేల్ ఆతిధ్యానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించి పలు ప్రభుత్వ పాలసీలపై గుజరాత్ సీఎంతో చర్చించారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు ఏకాంతగా చర్చించారు. అనంతరం రాష్ట్రానికి చేరుకున్నారు.

చంద్రబాబు సమీక్ష : అమరావతి సచివాలయంలో నేడు నూతన ఎక్సైజ్ పాలసీపై చంద్రబాబు సమీక్ష నిర్వహించానున్నారు. బీసీ సంక్షేమం, చేనేత, టెక్స్ టైల్స్ శాఖలపై సమీక్షించానున్నారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై సాయంత్రం ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేయనున్నారు.

పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్​లు, సమన్వయ కమిటీ సభ్యులతో సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు సమావేశమవుతారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాల ఇన్ఛార్జులతోనూ ఆయన భేటీ కానున్నారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోని టీడీపీ ఇన్ఛార్జులు, పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఓడిపోయిన చోట బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఏపీలో విన్‌-విన్‌ విధానం - గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్​లో చంద్రబాబు - CM CHANDRABABU AT RE INVEST 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.