ETV Bharat / state

గత ఐదేళ్లలో 227 ఎంవోయూలు - పైసా పెట్టుబడి రాలేదు: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU ON POLICIES

పారిశ్రామికవేత్తల కోసం ఉత్తమ విధానం తీసుకువచ్చామన్న సీఎం చంద్రబాబు - యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రాధాన్యమని స్పష్టం

CM_Chandrababu
CM Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 7:26 PM IST

Employment Target Through Policies: గడిచిన ఐదేళ్లలో 227 ఎంవోయూలు జరిగినా పైసా పెట్టుబడి రాష్ట్రానికి రాలేకపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అప్పులు పెట్టారని ధ్వజమెత్తారు. 1995 కంటే ముందు లైసెన్స్ రాజ్ కారణంగా పెట్టుబడులు రాలేదన్న సీఎం, ఆ తర్వాత ఆర్ధిక సంస్కరణల కారణంగా ఏపీలోనూ ఐటీని ప్రోత్సహించగలిగామని గుర్తు చేశారు. ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారే ఉన్నారంటే అప్పటి విధానపరమైన నిర్ణయమే కారణమన్నారు.

2047 నాటికి దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఉండాలన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్తల కోసం ఉత్తమ పాలసీలు తీసుకొచ్చినట్లు తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా విధానం మార్చుకున్నామని, ఉత్పత్తి వ్యయం తగ్గించటం, బ్రాండ్ ఇలా అన్ని అంశాల్లోనూ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీఎం వివరించారు. ప్రతీ కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాధ్యం చేసి చూపుతామని పేర్కొన్నారు. పెట్టుబడి ప్రాజెక్టులు అనుకున్న సమయానికే మొదలయ్యేలా ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రియల్ టైమ్​లోనే అనుమతులు జారీ, సెల్ఫ్ సర్టిఫికేషన్ అంశాన్ని కూడా తీసుకురావాలని భావిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో రిలయన్స్​ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

50 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఉత్పత్తిలో ఏపీని గ్లోబల్ డెస్టినేషన్​గా మార్చాలన్నది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ పాలసీ అన్ని రాష్ట్రాల విధానాల్ని అధ్యయనం చేసి రూపొందించామని తెలిపారు. ఏ విధానమైనా 2024-29 వరకూ అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలన్నది తమ లక్ష్యం అని వెల్లడించారు. 20 లక్షల మంది ఉపాధి వచ్చేలా ఈ విధానాలు రూపొందించామన్నారు. 83 వేల కోట్ల మేర విదేశీ పెట్టుబడులు రావాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.

175 నియోజకవర్గాల్లో ప్రతీ చోటా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రణాళిక చేశామని తెలిపారు. గతంలో ప్రతీ రెవెన్యూ డివిజన్​లోనూ ఓ ఇంజనీరింగ్ కళాశాలను పెట్టి ఇంజనీర్లను తయారు చేశామని అన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామని తెలిపారు. ఎంతవేగంగా అనుమతులు ఇస్తామన్నదే ప్రాతిపదికన పాలసీలు రూపొందాయని తెలిపారు.

ఎన్ని సవాళ్లు ఎదురైనా గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానం - స్పష్టం చేసిన చంద్రబాబు

Employment Target Through Policies: ఉద్యోగాలు, ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త విధానాలను రూపోందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మొదటిగా వచ్చిన 200 పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధానాలు ఉన్నాయన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. అమరావతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో టాటా ఇన్నోవేషన్ హబ్​లు ఏర్పాటు చేస్తామన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మలచాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ రూపకల్పన చేస్తున్నామన్న సీఎం, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసుకుని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇలా 10 వేల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగేలా చేస్తామని స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా ప్రతీ ఉత్పత్తికీ ఓ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు.

మోస్ట్ పవర్​ఫుల్ పొలిటీషియన్​గా మోదీ- ఐదో ప్లేస్​లో చంద్రబాబు- సీఎం జాబితాలో టాప్ కూడా ఆయనే

ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో పారిశ్రామిక పార్కులు: క్వాలిటీ, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఎంతగా ప్రోత్సహిస్తే అంతగా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. పండించే పంటలకు విలువజోడిస్తేనే ఎక్కువ ఆదాయం వస్తుందని, విలువ జోడిస్తే ప్రపంచానికే ఫ్రూట్ బాస్కెట్​గా ఏపీ అవతరిస్తుందని తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని కొత్త విధానం రూపోందించామన్నారు. కొత్త పద్ధతుల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు అవుతాయని వెల్లడించారు.

రైతులు కూడా విద్యుత్ విక్రయించొచ్చు: అమరావతిలో భూ సమీకరణ అనేది ఒక భూ సేకరణ మోడల్ అని, భూములు ఇచ్చిన రైతులు కూడా లాభపడాలని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు మంజూరైందని మౌలిక సదుపాయాలు, అభివృద్ది ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఓ పారిశ్రామిక ఎకో సిస్టం రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు. వ్యవసాయంతో సమానంగా ఏపీలో పరిశ్రమలు కూడా రావాలన్నారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలన్నది తమ ప్రభుత్వ విధానమని వివరించారు. గ్రీన్ హైడ్రోజన్ లాంటి కొత్త ఇంధనాల ఉత్పత్తి చేసేలా కొత్త విధానం ఉపకరిస్తుందని వ్యాఖ్యానించారు. వ్యవసాయం చేసుకునే రైతులు కూడా సౌర విద్యుత్ ఫలకాలు పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేసి విక్రయించొచ్చన్నారు.

ఈ నెల 29న గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ సంస్థ ముందుకు వచ్చిందన్న సీఎం, ఈ నెల 29 తేదీన గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు. మొత్తం 84 వేల 700 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడితో ప్రాజెక్టు వస్తుందని, ఎన్టీపీసీతో పాటు ఏపీ జెన్కో కూడా సంయుక్తంగా ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. రిలయన్స్ సంస్థ కూడా 65 వేల కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులకు ఉందని స్పష్టం చేశారు.

ఇసుక విధానంలో సమస్య ఉంటే చెప్పండి - పరిష్కారం చెప్తా: ఎమ్మెల్యేలతో చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.