ETV Bharat / state

వరద బాధితులను ఆదుకుంటాం- పంట నష్టాన్ని అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశాలు - Chandrababu on Floods in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 5:34 PM IST

Updated : Jul 26, 2024, 7:02 PM IST

CM Chandrababu Naidu Directions to Ministers: గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు రావడంతో ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. హోంశాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి బాధితుల్ని పరామర్శించాలని ఆదేశించారు.

CM Chandrababu Naidu Directions to Ministers
CM Chandrababu Naidu Directions to Ministers (ETV Bharat)

CM Chandrababu Naidu Directions to Ministers : గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు రావడంతో ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. వరి పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ముంపునకు గురైన పంట : హోంశాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి వరద బాధితుల్ని పరామర్శించాలని చంద్రబాబు ఆదేశించారు. దిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కారణంగా బాధితుల్ని పరామర్శించేందుకు తాను వెళ్లలేకపోతున్నానని అన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని తెలిపారు. వరి పంట 4,317 ఎకరాల్లో దెబ్బతిందని, 1.06 లక్షల ఎకరాల్లో నాట్లు వేసిన పంట ముంపునకు గురైందని పేర్కొన్నారు. మొక్కజొన్న, పత్తి పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.

గోదావరి వరద ముంపులో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాలు - People Suffer in FLOOD WATER

పంట నష్టాన్ని అంచనా వేయండి : అల్లూరి జిల్లాలోనూ కొన్ని చోట్ల వరద ప్రభావం ఉందని సీఎం అన్నారు. ఇప్పటికీ తూర్పు గోదావరిలో వేలాది ఎకరాల పంట నీట మునిగి ఉందని పేర్కొన్నారు. ఇళ్లు నీట మునిగిన వారికి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న కుటుంబాలకు రూ.3 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని సూచించారు. 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కేజీ చొప్పున సాయం ఇవ్వాలని స్పష్టం చేశారు. పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

People Suffering Due to Heavy Rains in Alluri District : అల్లూరి జిల్లాలో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంపచోడవరం మండలం పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే శిరీష దేవి సొంత ఖర్చులతో జేసీబీ ఏర్పాటు చేసి కొండ చరియల తొలగింపు పనులు చేపట్టారు. ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో భూపతిపాలెం జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు మూడు గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు.

అల్లూరి జిల్లాలో వర్ష బీభత్సం- విరిగిన కొండచరియలు, స్తంభించిన జన జీవనం - rain updates

ప్రమాదకరమైన వాగుపై సాహసం : వర్షాకాలంలో మారేడుమిల్లి మండలం సున్నంపాడు, నూరిపూడి గ్రామాల మధ్య పెద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నూరిపూడిలో విద్యుత్ సమస్య రావడంతో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాదకరమైన పెద్ద వాగుపై వైర్లు కట్టి సాహసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లోనూ తాడు సాయంతో గిరిజనులు వాగు దాటాల్సిన దుస్థితి ఏర్పడింది. వాగుపై వంతెన నిర్మాణం గతంలో చేసిన శంకుస్థాపనతో నిలిచిపోయింది. అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో దంచికొట్టిన వానలు - వేల ఎకరాల్లో పంట నష్టం - Heavy rains in west Godavari

Last Updated : Jul 26, 2024, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.