ETV Bharat / state

చరిత్ర లిఖించిన చంద్రబాబు మూడో సంతకం- అరకోటికి పైగా ప్రజానీకానికి సామాజిక భద్రత - CM Chandrababu Incrased Pension - CM CHANDRABABU INCRASED PENSION

CM Chandrababu Incrased Pension in AP : ఎన్నికల ఇచ్చిన హామీలో భాగంగా పింఛన్​ లబ్ధిదారులపై సీఎం చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర వర్గాలకు అందే రూ. 3 వేల పింఛను రూ. 4 వేలకు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పింఛన్​ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్​ కుమార్​ ప్రసాద్​ జారీ చేశారు.

pension_hike
pension_hike (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 9:51 AM IST

Updated : Jun 14, 2024, 2:59 PM IST

చరిత్ర లిఖించిన చంద్రబాబు మూడో సంతకం- అరకోటి పైగా ప్రజానీకానికి సామాజిక భద్రత (ETV Bharat)

CM Chandrababu Incrased Pension in AP : పింఛనుదారులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. పేద వర్గాల మోములో చిరునవ్వులు పూయించేలా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత పింఛన్ల పెంపు దస్త్రంపై సంతకం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో సీఎంగా బాధ్యతల స్వీకరణ అనంతరం మూడో సంతకం పింఛన్ల పెంపు దస్త్రంపై పెట్టారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్‌ భరోసా’ పేరు మీద ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. పింఛన్​ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్​ కుమార్​ ప్రసాద్​ జారీ చేశారు.

Officials Working on Increasing Pensions : వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుకళాకారులు, హిజ్రాలు, హెచ్‌ఐవీ బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న 3 వేల రూపాయలను పింఛన్‌ను ఒకేసారి 4 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి ఏప్రిల్‌ నుంచే పెంపును అమలు చేయనున్నారు. పెంచిన పింఛను జులై 1న రూ.7 వేలు (జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్‌ నుంచి మూడు నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి) అందిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్​ కుమార్​ ప్రసాద్​ జారీ చేశారు.

ఏప్రిల్‌ నుంచే రూ. 4 వేల పింఛన్ పెంపు - దృష్టి పెట్టిన అధికారులు - Pension Distribution

దివ్యాంగులకు ఎన్నడూ లేని భరోసా : సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసానిచ్చారు. ప్రస్తుతం వారికి అందుతున్న 3 వేల రూపాయలను ఒకేసారి 6 వేల రూాపాయలకు పెంచారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి అందే 5 వేల రూపాయల పింఛను 15 వేల రూపాయలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను కింద అందే 5 వేల రూపాయలను 10 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్ఠు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి 6 వేలు రూపాయలు పింఛను ఇవ్వనున్నారు. పెంచిన మొత్తాన్ని జులై 1న అందించనున్నారు.

ఏడాదికి రూ.33 వేల కోట్లు : రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛనుదార్లకు పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు 1,939 కోట్లు రూపాయలు ఖర్చవుతోంది. పెంచిన పింఛను అమలుకుగాను జులై నెలకు 4,408 కోట్లు రూపాయలు (ఏప్రిల్‌ నుంచి ఇచ్చే ఎరియర్స్‌ మొత్తం రూ.1,650 కోట్లు కలిపి) ఖర్చు కానుంది. ఆగస్టు నుంచి నెలకు 2,758 కోట్లు రూపాయలు అవసరమవుతుంది. మొత్తంగా సంవత్సరానికి రూ.33,099 కోట్లు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు.

'అప్పుడు ఎన్టీఆర్​, ఇప్పుడు చంద్రబాబు'- పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల హర్షాతిరేకాలు - Pension Hike In Andhra Pradesh

People Happy About Increase in Pensions : వృద్ధాప్య పింఛనును రూ. 4 వేలకు పెంచతూ సీఎం చంద్రబాబు సంతకం చేయడంపై వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే నిలబెట్టుకున్నారని కొనియాడారు. ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

బాధితుడికి అండగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి- అధికారులకు ఆదేశాలతో పింఛన్ - NALLAMILLI RAMAKRISHNA REDDY HELP

Last Updated : Jun 14, 2024, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.