పదే పదే చెప్తున్నా అలా చేయొద్దు! - మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన - CM Guidance to Ministers - CM GUIDANCE TO MINISTERS
CM Chandrababu Gave Some Guidelines to Ministers : గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ మంత్రులు, నేతలు చేసినట్లు కూటమి మంత్రులెవ్వరూ చేయెుద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక పలు రాజకీయ అంశాలపై సీఎం చర్చించారు.
![పదే పదే చెప్తున్నా అలా చేయొద్దు! - మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన - CM Guidance to Ministers CM Chandrababu Gave Some Guidelines to Ministers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-08-2024/1200-675-22149748-thumbnail-16x9-cbn.jpg?imwidth=3840)
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 7, 2024, 5:56 PM IST
CM Chandrababu Gave Some Guidelines to Ministers : గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ మంత్రులు, నేతలు చేసినట్లు కూటమి మంత్రులెవ్వరూ చేయెుద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీనిపై పదే పదే తాను చెప్తున్నానని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక పలు రాజకీయ అంశాలపై సీఎం చర్చించారు. వైఎస్సార్సీపీ చేసిన అరాచకాలపై కోపం, కసి ఉన్నా చట్టపరంగానే వెళ్దామని నేతలకు స్పష్టం చేశారు. చేయని తప్పుకు అక్రమ కేసుల్లో అరెస్టై జైలుకెళ్లిన బాధితుల్లో తానూ ఉన్నానని గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ ఎన్నికల్లో జరిగింది నిశబ్ద విప్లవమైతే బంగ్లాదేశ్లో వైలెంట్ విప్లవం చూశామని చెప్పారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఓటు రూపంలో ప్రజలు తీర్పు ఇచ్చారని, బంగ్లాదేశ్లో ప్రజా తిరుగుబాటు ఫలితం చూశామని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల అభివృద్ధి పై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల మధ్యే చర్చ పెట్టి, వారి అభిప్రాయాలకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులకు, శాసనసభ్యులకు సీఎం చంద్రబాబు సూచించారు.
అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి సిద్ధంగా లేను: చంద్రబాబు - CM Chandrababu on Law and Order
ఇద్దరు పిల్లల నిబంధనకు స్వస్తి! : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో నిబంధనలపై చర్చించారు. ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించే అంశాన్ని క్యాబినెట్‌లో తీర్మానించింది. జనాభా పెరుగుదల ఆవశ్యకతను గుర్తించి గత నిబంధనలను క్యాబినెట్ రద్దు చేయాలని నిర్ణయించింది. మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. మద్యం నూతన విధానం తెచ్చే విషయంలో ప్రతిపాదనలపై చర్చించనుంది. ఆదాయ ఆర్జన కోణంలో కాకుండా అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేలా తేవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 2014 -19, 2019-24 మధ్య కాలంలో వచ్చిన ఎక్సైజ్ పాలసీలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించించారని తెలుస్తోంది.
కరవు వచ్చినా ఇబ్బందుల్లేకుండా : అలాగే రీ సర్వే వివాదాలు 3 నెలల్లో పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అన్నారు. రీ సర్వేకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక మంత్రులతో ఈ అంశంపై చర్చించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అధికంగా రెవెన్యూ సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. భూముల రీసర్వే పేరుతో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. సర్వే రాళ్లపై పేర్లు, బొమ్మలు తుడిచేసి ప్రభుత్వ అవసరాలకు వినియోగిద్దామన్నారు. నదుల అనుసంధానం, సాగు, తాగుకి ఇబ్బందులు లేకుండా చేద్దామని చెప్పారు. నీటిని సద్వినియోగం చేసుకుని చెరువులు నింపుకునేలా ప్రణాళికలు రూపొందిద్దామని తెలిపారు. రాబోయే రోజుల్లో కరవు వచ్చినా ఇబ్బందుల్లేకుండా నీటి వినియోగ చర్యలు చేపడదామన్నారు. నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకనుగుణంగా ప్రజలతో మమేకమవుతూ జలహారతుల కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రులకు సూచించారు. అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగుల బదిలీలు చేద్దామన్నారు.
భువనేశ్వరి కోసం రెండు చీరలు కొన్న చంద్రబాబు - CBN in Handloom Day Celebrations
ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు - CM CBN Talks YouTube Academy