CM Chandrababu Attended Vanapally Grama Sabha: 'స్వర్ణ గ్రామపంచాయతీ' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో సీఎం పర్యటించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఉమ్మడి తూ.గో. జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో సీఎం వానపల్లిలోని పళ్లాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వానపల్లి గ్రామసభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో 'గ్రామ సభలు' పెట్టామని సీఎం అన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు పెట్టాని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది నరేగా కింద రూ.4,500 కోట్ల పనులకు అనుమతి తీసుకున్నామని నరేగా కింద వంద రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది 84లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందని సీఎం తెలిపారు. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నాకు. 2014-19 మధ్య గ్రామాభివృద్ధికి స్వర్ణయుగమని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహిళలు ఇబ్బంది పడ్డారని వైఎస్సార్సీపీ సభలకు వెళ్లినవారు బయటకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.
గ్రామాభివృద్ధిలో సర్పంచి పాత్ర కీలకమని సీఎం తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నరేగా నిధులు నేతల జేబుల్లోకి వెళ్లాయని అన్నారు. 2014-19 మధ్య 27,444 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేశామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు వేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గ్రామాల్లోని పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఇళ్లకు విద్యుత్, సురక్షిత తాగునీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు. వైఎస్సార్సీపీ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి ఎలా కల్పించాలనే ఎప్పుడూ ఆలోచిస్తున్నానని ఇంతా 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.
సంపద సృష్టించి పేదలకు పంచుతా. ఈ విషయంలో రాజీ లేదు. గత ఐదేళ్లలో ఉద్యోగులు, పింఛనుదారులకు జీతం సరిగా వచ్చేది కాదు. పేదవాడికి రూ.15కే మూడుపూటలా భోజనం పెడుతున్నాం. నైపుణ్యం ఉంటేనే యువత ఆదాయం పెరుగుతుంది. చీడపీడల నివారణకు ఆధునిక సాంకేతిక పరికరాలు వచ్చాయి. ప్రస్తుతం 12 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాధ్యం జరుగుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు వేయాలి. పంటలకు ఎరువులు, పురుగుమందులు బాగా తగ్గించాలి.- చంద్రబాబు, సీఎం
రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారు: సీఎం చంద్రబాబు - CM CBN Somasila Reservoir Visit