Clash Between Minister Ponnam And Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం చిగురుమామిడిలో పర్యటించిన ఆయన, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 'అయోధ్యలో రామమందిరం కట్టారు, అక్షింతల పేరుతో రేషన్ బియ్యం పంచుతున్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని నమ్మకం ఏంటి అని పొన్నం అడుగుతున్నారు. అయితే నేనూ ఒకటి అడుగుతున్నానంటూ పొన్నంపై బండి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించగా, తాజాగా బండి సంజయ్ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు. ఏదో అలజడి సృష్టించి, యాత్రను అడ్డుకోవాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో నిలబెట్టాలని, ఆ పార్టీ అభ్యర్థి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే పొన్న సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు.
నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేపడితే అనవసరంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నేను ఎక్కడా, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఏదో అలజడి సృష్టించి యాత్రను అడ్డుకోవాలంటే ఊరుకునేది లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ అభ్యర్థి ఎవరో నిలబెట్టండి. గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేకుంటే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా. - బండి సంజయ్
రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిధులను వివరించడానికే జనహిత యాత్ర: బండి సంజయ్
షరతులు విధించకుండా పథకాలను అమలు చేయాలి- బండి సంజయ్
Fight Between BJP and Congress Leaders : బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతకుముందు సిద్దిపేట జిల్లా బొమ్మెనపల్లి వద్ద బీజేపీ - కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ఈ నేపథ్యంలో ప్రజాహిత క్యాంప్ వైపునకు వెళ్లనీయకుండా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
క్యాంప్ వైపు కాంగ్రెస్ నేతలు కర్రలతో వచ్చారని, అయినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయరని బీజేపీ నేతలు ప్రశ్నించారు. యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తే చూస్తూ ఊరుకోమని బండి సంజయ్ తేల్చిచెప్పారు. ఆయనకు మద్దతుగా పార్టీ శ్రేణులు బొమ్మెనపల్లి వద్దకు భారీగా చేరుకునేందుకు యత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు బండి సంజయ్‌కు మద్దతుగా ప్రజాహిత క్యాంప్ సైట్ వద్దకు చేరుకుంటున్న శ్రేణులను నిలువరించారు. దీంతో పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలు ఏం చేయబోతున్నారో బండి సంజయ్‌కు ఎలా తెలుసు : పొన్నం ప్రభాకర్