ETV Bharat / state

రేషన్‌ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ - సర్కార్ తాజా నిర్ణయంతో వారికి మరింత లబ్ధి! - Good News to Ration Card Holders

AAY Ration Card Holders : తెలంగాణ సర్కార్ అంత్యదోయ అన్న యోజన రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. పౌరసరఫరాల శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో AAY రేషన్ కార్డుదారులకు మరింత లబ్ధి చేకూరనుంది. ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం? ఎలాంటి లబ్ధి చేకూరనుంది? అన్నది ఇప్పుడు చూద్దాం.

Telangana
Ration Card
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 2:14 PM IST

Good News to Ration Card Holders : అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో AAY రేషన్ కార్డు ఉన్నవారికి మరింత లబ్ది చేకూరనుంది. ఇంతకీ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయమేంటి? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం అంత్యోదయ అన్న యోజన(AAY) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన వారికి నెలనెలా ఒక్కో కుటుంబానికి సబ్సిడీపై 35 కిలోల బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేయడం జరుగుతోంది. వీటితోపాటు వారికి చక్కెర కూడా పంపిణీ చేస్తారు. అయితే.. తెలంగాణలో(Telangana) చాలా మంది రేషన్ డీలర్లు అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డు ఉన్నవారి బియ్యం, గోధుమలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. చక్కెర మాత్రం ఇవ్వడం లేదు. కొందరు డీలర్లయితే డీడీలే తీయకుండా ఉంటున్నారు. మరికొందరు డీడీలు తీసినా చక్కెర రాలేదని సాకులు చెబుతున్నారు.

ఈ విషయం పౌరసరఫరాల శాఖ దృష్టికి చేరింది. దాంతో వెంటనే స్పందించిన పౌరసరఫరాల శాఖ.. రేషన్ డీలర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలవారీగా అవసరమైనంత చక్కెర తీసుకుని.. AAY రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఇకపై అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు ఉన్నవారికీ చక్కెర అందనుంది.

'భారత్​ రైస్​' రేషన్​ దుకాణాల ద్వారా పంపిణీ చేయించాలి : రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5.99 లక్షల మంది ఏఏవై రేషన్‌కార్డుదారులు ఉన్నారు. కార్డుకు కిలో చొప్పున ప్రతి నెలా 599 టన్నుల చక్కెర అవసరం పడుతుంది. ఈ మేరకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో షుగర్ నిల్వలు ఉంచాల్సి ఉంది. డీలర్లు తమ పరిధిలో ఉన్న కార్డుల అవసరం మేరకు డీడీలు కట్టి.. పంచదార తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 17,235 మంది డీలర్లు ఉన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచే కార్డు దారులకు బియ్యం సరఫరా మొదలైనప్పటికీ.. చాలా దుకాణాల్లో చక్కెర పంపిణీ జరగట్లేదు.

వాస్తవానికి.. డీలర్లు రేషన్ కార్డుదారులకు బియ్యం, గోధుమలు, చక్కెరల్లో ఏమిచ్చారు..? ఎంతిచ్చారు? అన్నది ప్రింట్‌ ఇవ్వాలి. కానీ.. చాలా రేషన్‌ దుకాణాల్లో ఈ ప్రింట్లు ఇవ్వడం లేదు. మార్కెట్​లో చక్కెర రూ. 40-45 వరకు ఉంటే.. AAY కార్డు ఉన్నవారికి సబ్సిడీపై కిలో చక్కెర రూ.13.50లకే అందించాలి. లబ్ధిదారులకు టోపీ పెడుతున్న కొందరు డీలర్లు.. బియ్యంతో సరిపెట్టి చక్కెరను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పౌరసరఫరాల శాఖ ఆదేశాల నేపథ్యంలో.. ఇప్పటినుంచైనా ఏఏవై రేషన్ కార్డు ఉన్నవారికి డీలర్లు సక్రమంగా పంచదార పంపిణీ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

గ్రేటర్​లో ఆరో తేదీలోపు బిల్లులు జారీ చేయాలి - విద్యుత్​ సిబ్బందికి ఆదేశాలు - hyderabad zero current bills

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.