ETV Bharat / state

ఆన్‌ఫీల్డ్‌లో డీఎస్‌ చౌహన్‌ - ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక పర్యటన - paddy procurement in telangana

DS Chauhan on Paddy Procurement : రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయవద్దని, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు.

DS Chauhan visit Paddy centers
DS Chauhan on Paddy Procurement
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 10:07 PM IST

DS Chauhan on Paddy Procurement : ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌ ప్రారంభమైన దృష్ట్యా, గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌(DS Chauhan) పేర్కొన్నారు. ఇవాళ మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన, క్షేత్రస్థాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల పనితీరు పరిశీలించారు.

రాష్ట్రంలో ధాన్యం సేకరణ సక్రమంగానే జరుగుతోంది : డీఎస్ చౌహాన్ - DS Chauhan on Grain Procurement

DS Chauhan visit Paddy centers : ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయవద్దని డీఎస్‌ చౌహన్‌ స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి రవాణా చేయబడిన వరి ధాన్యం అన్‌లోడ్ చేసే ప్రక్రియ పరిశీలించడానికి, పలు రైస్‌ మిల్లులను కూడా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో నేరుగా మాట్లాడారు. స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది పనితీరు ఎలా ఉందంటూ ఆరా తీశారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు పల్లా సందీప్‌కు ఫోన్ కాల్ చేశారు. ధాన్యం సేకరణ, నగదు చెల్లింపు ప్రక్రియలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వడ్లు కాంటా వేసిన 2 రోజుల్లో సొమ్ము తన బ్యాంకు ఖాతాలో జమైందని లబ్ధిదారుడు తెలిపారు. ఆ రైతు నుంచి లభించిన సంతృప్తికరమైన స్పందన చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందిని కమిషనర్ చౌహాన్ అభినందించారు.

Paddy Procurement in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ యాసంగీ సీజన్‌కు 7149 ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ, ఇప్పటి వరకు 6919 కేంద్రాలను ప్రారంభించింది. పల్లెల్లో దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులు వడ్లు అమ్ముకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎఫ్​సీఐ(FCI) నిబంధనలు ప్రకారం 17 శాతం తేమ ఉన్న వడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులకు తీసుకురావాలని ప్రభుత్వం పేర్కొంది.

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా 56 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరించిన 48 గంటల్లో నగదు చెల్లింపులు చేస్తునున్నట్లు ప్రభుత్వం తలెపింది.

ఆన్‌ఫీల్డ్‌లో డీఎస్‌ చౌహన్‌- ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక పర్యటన

రాష్ట్రంలో ముమ్మరంగా యాసంగి వరి కోతలు - 5,923 కేంద్రాల్లో చురుగ్గా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు - Paddy Procurement in Telangana

తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఎవర్నీ వదిలేది లేదు : రేవంత్​ రెడ్డి - REVANTH REDDY on paddy procurement

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.