ETV Bharat / state

న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది : ఝాన్సీ కామెంట్స్​పై జానీ కౌంటర్ - ANCHOR JHANSI VS JANI MASTER

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​పై సినీ నటి ఝాన్సీ కామెంట్స్ - ఎక్స్ వేదికగా జానీ మాస్టర్ కౌంటర్

Anchor Jhansi vs Jani Master
Anchor Jhansi vs Jani Master (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 3:26 PM IST

Anchor Jhansi vs Jani Master : లైంగిక ఆరోపణల కేసును ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​పై సినీనటి, వ్యాఖ్యాత ఝాన్సీ సోషల్ మీడియాలో స్పందించింది. సోషల్ మీడియాలో వేదికగా పోస్టు పెడుతూ లైంగిక ఆరోపణ కేసులో జానీ మాస్టర్ వేసిన మధ్యంతర పిటిషన్​ను జిల్లా కోర్టు కొట్టివేసిందని పేర్కొంది.

ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ జానీ మాస్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, పని ప్రదేశాల్లో మహిళ భద్రతతో పాటు లైంగిక వేధింపుల నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కోర్టు జానీ మాస్టర్ పిటిషన్​ను కొట్టివేసిందని పేర్కొన్న ఝాన్సీ, ఇది ఫిల్మ్ ఛాంబర్ సాధించిన విజయంగా తెలిపింది. డ్యాన్స్ ఫెడరేషన్​పై న్యాయపోరాటం చేసిన ఫిల్మ్ ఛాంబర్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

యాంకర్ ఝాన్సీ ఇంస్టాగ్రామ్ పోస్ట్
యాంకర్ ఝాన్సీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ (ETV Bharat)

చివరికి న్యాయమే గెలుస్తుంది : అయితే ఝాన్సీ పోస్టుపై స్పందించిన జానీ మాస్టర్ సొంత లాభం కోసం కొంత మంది కోర్టు తీర్పులను కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను చూస్తే జాలేస్తుందన్న జానీ మాస్టర్, డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కు సంబంధించిన కేసులో కోర్టు తీర్పు వచ్చిందని స్పష్టం చేశారు. ఆ తీర్పును లైంగిక ఆరోపణల కేసుతో ముడి పెట్టి పోస్టులు పెడుతున్నారని పేర్కొన్న జానీ మాస్టర్, అసలు తీర్పు వివరాలు బయటికి వచ్చిన రోజు నిజాలేంటో అర్థమవుతాయని, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుందని అన్నారు. చివరికి న్యాయమే గెలుస్తుందని ఆయన వెల్లడించారు.

చట్టపరంగా పోరాటం చేస్తున్నా : లైంగిక వేధింపుల ఆరోపణలతో గత సంవత్సరం జానీ మాస్టర్‌ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని డ్యాన్స్‌ యూనియన్‌ నుంచి తొలగించినట్లు గతంలో వార్తలు ప్రచారం అయ్యాయి. దీనిపై ఆయన ఎక్స్ (X) వేదికగా స్పందించారు. నిర్దరణ కానీ ఆరోపణలను కారణంగా చూపిస్తూ తనను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్లు మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాటిని నమ్మకండని, తన పదవీకాలం ఇంకా ఉందని తెలిపారు. అయితే అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని పెర్కోన్నారు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా పోరాటం చేస్తున్నానని, త్వరలోనే వివరాలు చెబుతానని, టాలెంట్ ఉన్నవారికి పని ఇవ్వకుండా, పని దొరకకుండా ఎవరూ ఆపలేరని ఆయన తెలిపారు.

సుప్రీంకోర్టులో జానీ మాస్టర్​కు ఊరట - బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.