Chit fund fraud four arrested in Kamareddy : చిట్ ఫండ్స్ పేరిట సభ్యులను మోసం చేయడానికి యత్నించిన నలుగురి నిర్వాహకులను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్‌వీఎస్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటైన చిట్‌ఫండ్స్ కంపెనీ యజమానులు బిల్ల దశరథెడ్డి(ప్రభుత్వ ఉపాధ్యాయుడు), ఆయన భార్య పద్మావతి, కుమారుడు నితీశ్ రెడ్డిలతో పాటు బిల్ల అచ్యుత్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు అహ్మద్ మొహియుద్దీన్ వీరి చిట్‌ఫండ్స్ కంపెనీలో రెండు చీటీలు వేశారు. చీటీల గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో అహ్మద్ కంపెనీ యజమానులను సంప్రదించాడు. వారిని సంప్రదిస్తే అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపుతామని బెదిరింపులకు దిగారు. వారిపై రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్(Registrar of Chits) దగ్గర కూడా అనేకమంది ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన కనిపించలేదు.
రూ.2 కోట్ల మేర మోసం : ఇలా సుమారు 25 నుంచి 30 మంది వరకు చీటీ సభ్యులకు సంబంధించిన సుమారు రూ.2 కోట్ల మేర మోసం చేసి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడు అహ్మద్ మొహియుద్దీన్ తెలసుకున్నారు. దీంతో ఈ నెల 14న సదరు చిట్ ఫండ్స్ కంపెనీ యజమానులపై ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు విచారణ చేపట్టి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Fraud in Chit funds in kamareddy : చిట్‌ఫండ్స్ కంపెనీని కామారెడ్డితో పాటు సికింద్రాబాద్ శివారులోని కొంపల్లి, నిజామాబాద్, ఆర్మూర్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, షాద్‌నగర్, మెట్పల్లి, వనపర్తి ప్రాంతాల్లో ప్రారంభించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కంపెనీ నిర్వాహకుల నుంచి కారుతో పాటు ఐదు చరవాణులు, చీటీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చిట్ ఫండ్స్ కంపెనీ బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సీఐ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.
'జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్‌వీఎస్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రెండు చీటీలు బాధితుడు వేశారు. చీటీల గడువు అయిపోయినా డబ్బులు ఇవ్వకపోవడంతో దానికి గురించి అడిగారు. అడిగితే దుర్భాషలాడుతూ బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారు. విచారణ చేపట్టగా కుటుంబ సభ్యులే యజమానులుగా ఉండి చీటీలు నడిపించారని తెలిసింది. రూ.2 కోట్ల మేర మోసం చేసి పారిపోయే ప్రయత్నం చేసినట్లు ఒప్పుకున్నారు.'-చంద్రశేఖర్ రెడ్డి, సీఐ
ఖాకీ ఉద్యోగాల పేరుతో రూ.11 లక్షలు కుచ్చుటోపీ - నకిలీ పోలీస్ అరెస్టు - fake cop arrested