ETV Bharat / state

చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్న పవన్ - జనసేనకు మెగాస్టార్​ రూ. 5 కోట్ల విరాళం - Pawan Kalyan Met Chiranjeevi - PAWAN KALYAN MET CHIRANJEEVI

Chiranjeevi Donates 5 Crore Rupees to Janasena: జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ప్రముఖ సినీ నటుడు చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ ముచ్చింతల్‌లో విశ్వంభర సినిమా షూటింగ్‌లో ఉన్న చిరంజీవిని జనసేనాని పవన్‌ కల్యాణ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. పవన్‌ చిరంజీవి పాదాలకు నమస్కరించి ఆశ్వీర్వాదం తీసుకున్నారు.

Pawan Kalyan Met Chiranjeevi
Chiranjeevi Donates 5 Crore Rupees to Janasena
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 5:49 PM IST

Updated : Apr 8, 2024, 7:38 PM IST

Chiranjeevi Donates 5 Crore Rupees to Janasena: జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ప్రముఖ సినీ నటుడు చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్​కు మెగాస్టార్ ఆశీస్సులు అందించారు. తన సోదరుడు పవన్ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన జనసేన పార్టీకి చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో ‘విశ్వంభర’ షూటింగ్ (Vishwambhara Movie) లొకేషన్​కు పవన్ కల్యాణ్‌, నాగబాబు కలిసి వెళ్లారు. అక్కడే చిరంజీవి పవన్ కల్యాణ్​ను హత్తుకుని ఆశీర్వదించారు.

'ఈ ఎన్నికల్లో యుద్ధం మాత్రమే ఉంటుంది - కూటమి గెలుపే లక్ష్యం'

చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న పవన్ కల్యాణ్‌ ఉద్వేగానికి లోనై అన్నయ్య పాదాలకు నమస్కరించారు. అనంతరం జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కల్యాణ్‌కు అందించారు. పార్టీ స్థాపించి పదేళ్లుగా అన్న చిరంజీవి ఆశీర్వాదాల కోసం పవన్ ఎదురు చూస్తున్నారు. తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి(Lord Hanuman) పాదాల చెంత చిరంజీవి పవన్ కల్యాణ్‌ని ఆశీర్వదించారు.

తనను ఆహ్వానించి ఆశీర్వదించటంతో పాటు పార్టీకి ఆర్థిక సహకారం అందించటంతో పవన్ ఉద్వేగానికి లోనయ్యారు. నీ వెనక నేనున్నాను అనే భరోసా పవన్ కల్యాణ్‌కు దక్కింది. అనంతరం మెగా సోదరులు ముగ్గురూ కాసేపు సంభాషించుకున్నారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టీవీలో ఆ దృశ్యాన్ని చూసిన చిరంజీవి(Megastar Chiranjeevi) పవన్​ను ఆహ్వానించారు. చిరంజీవి తనయుడు రామ్​చరణ్ కూడా జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సంతోషాన్ని కలిగించిన విషయం: అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. కానీ అధికారం లేకపోయినా, తన సంపాదనను రైతు కూలీల కోసం పవన్ కల్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయమని చిరంజీవి తెలిపారు. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కల్యాణ్(Pawan Kalyana) లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకు విరాళాన్ని అందించినట్లు తెలిపారు. జనసేనకు విరాళం అందించడం సంతోషకరంగా ఉందని చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు.

పవన్ కల్యాణ్​ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ - పిఠాపురం నుంచే సమరశంఖం - Pawan Kalyan Election Campaign

ఆంధ్రప్రదేశ్​లో ధర్మానిదే విజయం - పొత్తుదే గెలుపు - కూటమిదే పీఠం : పవన్ కల్యాణ్‌

Last Updated : Apr 8, 2024, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.