ETV Bharat / state

పిల్లలు తరచూ ఫోన్‌ చూస్తున్నారా - సైబర్‌ బానిసత్వానికి గురయ్యారేమో - ఈ అలవాట్లుంటే జాగ్రత్త పడాల్సిందే - TIPS STOP PHONE ADDICTION IN CHILDS

ఫోన్‌ అలవాటుతో చిన్నారుల్లో సైబర్ బానిసత్వం - తల్లిదండ్రులు మేల్కోవాలంటున్న నిపుణులు

Tips To Stop Phone Addiction in Children
Tips To Stop Phone Addiction in Children (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2024, 12:04 PM IST

Tips To Stop Phone Addiction in Children : ఈ రోజుల్లో చాలామంది నిద్ర లేవగానే పడుకునే ముందు స్మార్ట్‌ఫోన్ చూడటం వ్యసనంగా మారింది. మాట్లాడటానికి, డబ్బు లావాదేవీలకు, ప్రయాణాలకు, వినోదానికి, కాలక్షేపానికి ఇలా ప్రతిదానికి సెల్‌ఫోన్‌పై ఆధారపడి ఉంటున్నారు. వృద్ధుల దగ్గర నుంచి పసిపిల్లల వరకు అందరి వేళ్లు ఫోన్‌పైనే ఉంటున్నాయి. ఈ పరికరం సాంకేతికతను దగ్గర చేస్తూనే సైబర్‌ నేరాలను పెంచేస్తోంది. ముఖ్యంగా చిన్నారులను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సర్వేలు సైతం ఇదే అంశాన్ని ఉటంకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్‌ వ్యసనం నుంచి విముక్తి కలిగించే అంశాలపై తెలంగాణ మహిళా భద్రతా విభాగం అవగాహన కల్పిస్తోంది.

సైబర్‌ బానిసత్వం కారణంగా పిల్లలకు కలిగే అనర్థాలను బహిరంగపరచాలన్న ఉద్దేశంతో ఓ స్మార్ట్‌ పేరెంట్‌ సొల్యూషన్‌ కంపెనీ ఇటీవల మెట్రో నగరాల్లో వెయ్యి మంది తల్లిదండ్రులను సర్వే చేసింది. ముఖ్యంగా సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సామాజిక అంతరాలు ఏర్పడటం, సరిగ్గా చదవకపోవడం లాంటి అనర్థాలు కలుగుతున్నట్లు గుర్తించింది.

  • 5-16 ఏళ్ల వయసున్న వెయ్యి మంది పిల్లల్లో 60% మంది సైబర్‌ బానిస మనస్తత్వం అంటే ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పెట్డడం, డిజిటల్‌ ఎడిక్షన్‌తో బాధపడుతున్నారు.
  • ఆన్‌లైన్‌ కంటెంట్‌ వినియోగం నుంచి తమ పిల్లలను ఎలా మాన్పించాలనే అంశంలో 85% మంది తల్లిదండ్రులకు సరైన అవగాహన లేదు. ఈ విషయంలో వారంతా తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.
  • 70-80% మంది పిల్లల్లో స్క్రీన్‌ టైం చూడాల్సిన దానికంటే ఎక్కువగా చూస్తున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడటంతోపాటు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం వృథా చేస్తున్నారు
  • స్మార్ట్‌ఫోన్లలో ‘పేరెంటల్‌ కంట్రోల్‌ ఫీచర్‌’ ద్వారా పిల్లల స్క్రీన్‌టైంను నియంత్రించే అవకాశమున్నా 10% మంది తల్లిదండ్రులే దీన్ని ఉపయోగిస్తున్నారు.

మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారా?- డోంట్ వర్రీ స్కీన్ టైమ్ తగ్గించుకోండిలా! - Screen Time Reduction Tips

డిజిటల్‌ పరికరాలు, ఆన్‌లైన్‌ కార్యకలాపాల వినియోగం పెరగడాన్ని సైబర్‌ వ్యసనంగా అంటారు. దానికి ఇవే సంకేతాలు

  • ఇది ఆన్‌లైన్‌ ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది
  • జీవితంలోని పలు అంశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది
  • ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతూ వ్యక్తిగత బాధ్యతలను విస్మరించడం
  • స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్‌లను దూరం చేస్తే చిరాకు పడటం, మొండిగా వ్యవహరించడం
  • ఇంట్లో వారితో కంటే ఆన్‌లైన్‌ స్నేహితులతో మాట్లాడటానికి ప్రాధాన్యం ఇవ్వటం
  • శారీరక ఆరోగ్యంపైనా దీని ప్రభావం
  • బరువు పెరగడం
  • శారీరక దృఢత్వాన్ని కోల్పోవడం
  • నిశ్చల జీవనశైలికి అలవాటయ్యే ప్రమాదముంది.

ఆఫ్‌లైన్‌ కార్యకలాపాలకు ప్రోత్సాహం : పిల్లలు క్రీడలు, వ్యాయామ కార్యకలాపాల్లో పాల్గొనేలా చెయాలి. సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించాలి. చిత్రలేఖనం, పుస్తక పఠనం లాంటి ఆసక్తులను పెంపొందించేందుకు కృషి చేయాలి.

డిటిటల్‌ డిటాక్స్ సాధన : డిజిటల్‌ పరికరాల నుంచి ఒకేసారి దూరం చేయకుండా క్రమంగా వాటిని వాడకం తగ్గించే విధంగా ప్లాన్ చేయాలి.

ప్లాన్‌తో ముందుకు : కుటుంబసభ్యులతో, స్నేహితులతో తరచూ బయట కలిసి సమయం గడిపేలా చేయాలి. రోజుకు ఎంతసేపు ఫోన్‌ వాడాలి ప్లాన్‌ చేసేలా వ్యూహాలను రూపొందించాలి.

తల్లిదండ్రులు ఈ ఫీచర్ తప్పక వాడాలి : ఈ కాలం పిల్లలకు డిజిటల్‌ విజ్ఞానం తప్పక ఉండాలి. కానీ దానికి బానిసలుగా కాకుండా చూడాల్సిన బాధ్యత పేరేంట్సేదే. అందుకు చిన్నారుల వాడే ఫోన్లో పేరెంట్ కంట్రోల్‌ ఫీచర్‌ను ఉపయోగించాలి. దీని ద్వారా ఫోన్‌ వాడకం నియంత్రణ, హానికర యాప్‌లు, వెబ్సైట్లు తెరవకుండా చేయడంతోపాటు వారు ఫోన్‌లో ఏం చూశారో పేరెంట్స్‌ ఎప్పుడూ ఒక కన్నూ వేసి ఉంచవచ్చు.

ఈ పండగకి స్మార్ట్​ఫోన్ కొనే ప్లాన్ చేస్తున్నారా?- 15వేల లోపు టాప్​ ఇవే! - Best Smartphones Under 15K

'2ఏళ్లలోపు చిన్నారులను ఫోన్​కు దూరంగా ఉంచాల్సిందే- ఆరేళ్లు దాటితే రోజుకు 2గంటలు మాత్రమే!' - No Cell Phone Policy For Children

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.