Child Suffering From Blood Clots In Brain : కొడుకు పుట్టాడన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు నెల రోజులు కూడా గడవకముందే ఆవిరైపోయింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న బాబు హఠాత్తుగా అనారోగ్యం పాలవ్వడంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. తమ చిన్నారికి పెద్ద ఆరోగ్య సమస్య ఉందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బాబును రక్షించుకునేందుకు అప్పులు చేసి మరీ మూడు సార్లు శస్త్ర చికిత్సలు చేయించారు. అయినప్పటికీ సమస్య తగ్గకపోగా మళ్లీ ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో చిన్నారిని కాపాడుకునేందుకు దాతల ఆపన్న హస్తం కోసం ఆ తల్లిదండ్రులు దీనంగా ఎదురుచూస్తున్నారు.
Looking For Donor Help In Hanamkonda : హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్, అశ్విత దంపతులకు మూడేళ్ల పాపతో పాటు ఏడాది వయసుగల బాబు మహాన్ ఉన్నాడు. బాబు పుట్టిన నెలరోజులకు ప్రారంభమైన వారి కష్టాలు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. బాబు పుట్టిన నెల రోజులకే అనారోగ్యం పాలవ్వడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు మహాన్ మెదడులో రక్తం గడ్డ కట్టిందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు.
"మా బాబు పుట్టిన నెల రోజులకే ఆరోగ్య సమస్యలు రావడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. వైద్యులు మెదడులో రక్తం గడ్డ కట్టిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పులు చేసి మూడు సార్లు ఆపరేషన్ చేయించాము. కానీ పూర్తిగా నయం కాకపోవడంతో పాటు రోజురోజుకు పెద్ద పరిమాణంలో గడ్డ పెరుగుతుండడంతో డాక్టర్ను సంప్రదిస్తే మరో మారు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీనికి 6 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటికే అప్పులు చేసి ఆపరేషన్ చేపించాం. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. దాతలు దయాహృదయంతో ఎవరైనా సాయం చేస్తే మా బాబును కాపాడుకుంటాము." - బాబు, తల్లిదండ్రులు
సోనూసూద్ పెద్ద మనసు.. వెన్నుముక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి హామీ
వెంటనే చిన్నారి తల్లిదండ్రులు బాబుని హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. అందుకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో అప్పులు చేసి మూడు సార్లు ఆపరేషన్ చేయించారు. శస్త్ర చికిత్సలు జరిగినా పూర్తిగా నయం కాకపోవడంతో పాటు కణతి రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. వైద్యులను సంప్రదిస్తే మరో రెండు శస్త్ర చికిత్సలు చేయాలన్నారు. అందుకు సుమారు రూ. 6 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
Child Seeks Financial Aid for Treatment : నిరుపేద కుటుంబం కావడంతో బాబు ఇంకా చికిత్స చేయించే స్థోమత లేక వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే లక్షల్లో అప్పులు చేసి చికిత్స చేయించిన తమకు ఏం చేయాలో పాలుపోక దయనీయ పరిస్థితుల్లో తల్లిదండ్రులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ కుమారుడిని కాపాడుకుంటామని ప్రాధేయపడుతున్నారు. పెద్ద మనసుతో దాతలు ఎనరైన ముందుకు వచ్చి సాయం చేస్తే తమ కుమారునికి పునర్జన్మ ప్రసాదించిన వారు అవుతారని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.