Child Died of a Fatal Disease in Yadadri : అబ్బాయి పుట్టాడని సంతోషించిన ఆ తల్లిదండ్రులు, మూడో నెల వచ్చే సరికి కదలికలు సరిగా లేవని గుర్తించి ఆందోళన చెందారు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాంతక వ్యాధి వచ్చిందని తెలుసుకున్నారు. ఆ వ్యాధి నివారణకు ఇంజెక్షన్ ఒక్కటే మార్గమని, దానికోసం రూ.16 కోట్లు అవుతుందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు అక్కడే విషాదంలో మునిగిపోయారు. వారు మధ్య తరగతి కుటుంబం కావడంతో దాతలను ఆశ్రయించారు. దానికి స్పందించిన ఓ సంస్థ రూ.10 కోట్లు ఇచ్చింది. అయినా మిగిలిన డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ఉండటంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ హృదయ విషాదక ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
6 Months Baby Died due to Insufficient Money : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల మదిర గ్రామం గోలిగూడేనికి చెందిన కొలను దిలీప్‌రెడ్డి - యామిని దంపతులకు 6 నెలల కుమారుడు భవిక్ రెడ్డి ఉన్నాడు. దిలీప్ రెడ్డి హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నారు. కుటుంబంతో పాటు అక్కడే నివాసం ఉంటున్నారు. బాబు పుట్టినప్పుడు బాగానే ఉన్నప్పటికీ, మూడో నెల నుంచి బాబు కదలికలు సరిగా లేవని దంపతులు గుర్తించారు. దీంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(నరాల కండరాల బలహీనత) టైప్-1 హైరిస్క్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
అయ్యో పాపం - 5 నెలల పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క - PET DOG KILLED A BOY IN VIKARABAD
Child Died Due to Fatal Disease : ప్రాణాంతకమైన వ్యాధి నయం కావడానికి ఇంజెక్షన్ ఒక్కటే మార్గమని, అది అమెరికాలో లభిస్తుందని, దాని ఖరీదు రూ.16 కోట్ల ఉంటుందని తెలిపారు. తమది మధ్య తరగతి కుటుంబం కావడం, కుమారుడి వైద్యం కోసం సమకూర్చాల్సిన డబ్బు రూ.కోట్లలో ఉండటంతో దిలీప్ రెడ్డి దాతల సహకారం కోరారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఓ ఫార్మా కంపెనీ రూ.10 కోట్లు సమకూర్చింది. మిగిలిన రూ.6 కోట్లు సమకూరలేదు. దీంతో ఇంజెక్షన్‌ను తెప్పించలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవిక్ రెడ్డి పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో అతని తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది.