ETV Bharat / state

చెంచు మహిళపై దాష్టీకం - నిందితులను వదిలేది లేదని జూపల్లి హెచ్చరిక - Attack on Chenchu ​​Woman - ATTACK ON CHENCHU ​​WOMAN

Chenchu ​​Woman Attacked in Nagar Kurnool : ఓ చెంచు మహిళపై పాశవికంగా కొందరు దాడి చేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో స్వచ్ఛంద సంస్థల దృష్టికి చేరింది. వారి ప్రమేయంతో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. కానీ ఈ విషయంలో కీలక వ్యక్తులను వదిలేశారని స్థానిక చెంచులు ఆరోపిస్తున్నారు. బాధితురాలిని పరామర్శించిన ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Chenchu ​​Woman Attack in Nagar Kurnool
Chenchu ​​Woman Attack in Nagar Kurnool (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 1:24 PM IST

Updated : Jun 22, 2024, 1:47 PM IST

Chenchu ​​Woman Brutally Hurt in Nagarkurnool : నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ తాలూకా మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడిపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. నాగర్​ కర్నూల్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆయన పరామర్శించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితురాలిని, ఆమె భర్తను జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిందితులను చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి పాశవిక చర్యలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వపరంగా వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమిని అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత పిల్లలకు ప్రభుత్వపరంగా విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

"చెంచు మహిళపై దాష్టీకమైన దాడి జరిగింది. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి జరగడం బాధాకరం. బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం." - జూపల్లి కృష్ణారావు, మంత్రి

అసలేం జరిగిందంటే : నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ-ఈదన్న దంపతులు. కొల్లాపూర్​లోని ఓ వ్యక్తి వద్ద రూ.30 వేలు తీసుకుని కూలీ పనికి కుదిరారు. వారు పని సక్రమంగా చేయడం లేదంటూ ఆ యజమాని ఇబ్బందులు పెట్టేవాడు. అతని బాధను తట్టుకోలేని దంపతులు తమ సొంత భూమిని కౌలుకు తీసుకున్న బండి వెంకటేశ్​ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.30 వేలను తీసుకొని కొల్లాపూర్​కు చెందిన వ్యక్తికి చెల్లించారు.

ఈ క్రమంలో ఈశ్వరమ్మ, ఈదన్నలను వారి సొంత పొలంలోనే వెంకటేశ్​ వారిని కూలీ పనికి పెట్టుకున్నాడు.​ వారికి కూలీ డబ్బులు చెల్లించకుండానే వెట్టిచాకిరి చేయించుకునేవాడు. చేయకపోతే ఇబ్బందులు పెట్టేవాళ్లు. వారు అక్రమంగా నడిపే ఇసుక ఫిల్టర్​ కేంద్రంలో పనికి పంపేవాడు. ఆమెతో గంటలోనే ట్రాక్టర్​ లోడ్​ ఇసుకను నింపాలని ఆదేశించేవాడు. ఒకవేళ అలా చేయకపోతే దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు పాల్పడేవాడు. వాటిని తట్టుకోలేని బాధిత మహిళ తన భర్తతో గొడవపడి పుట్టింటికి చుక్కాయిపల్లికి వెళ్లిపోయింది.

గదిలో బంధించి చిత్రహింసలు : ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న బండి వెంకటేశ్​, అతని కుటుంబ సభ్యులు 10 రోజుల కిందట ఆమెను మొలచింతలపల్లికి తీసుకొచ్చి తమ ఇంట్లోనే బంధించి దారుణంగా కొట్టారు. కళ్లు, జననాంగాల్లో కారం పోశారు. శరీరంపై కాల్చి, వాతలు పెట్టారు. అప్పటి నుంచి ఆమెను వారి ఇంట్లోనే పెట్టి గ్రామంలోని ఓ ఆర్​ఎంపీతో వైద్యం చేయించారు. ఈ విషయం తెలుసుకున్న ఈదన్న గ్రామస్థులతో కలిసి ఈశ్వరమ్మను పంపించమని బండి వెంకటేశ్​ను కోరాడు. దీంతో అతను బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎలాగోలా కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకొని రాగా, ఆ చెంచు మహిళపై జరిగిన దాష్టీకం బయటకు వచ్చింది.

ఈ విషయం బయటకు రావడంతో జాతీయ ఆదివాసీ సాలిడార్టి సంస్థ కౌన్సిల్​ సభ్యులు, పోలీసులు, సఖి సభ్యులు ఆమె గ్రామానికి వెళ్లి బాధితురాలిని కొల్లాపూర్​ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో నాగర్​కర్నూల్​ జనరల్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె ఒంటిపై ఉన్న గాయాలను చూసి వైద్యులు కూడా నివ్వెరపోయారు. నిందితుల పేర్లను వెల్లడించేందుకు బాధితురాలు భయపడిందంటే నిందితుల ఆగడాలు ఆమెపై ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

సోషల్​ మీడియాలో వీడియో వైరల్ : శుక్రవారం వెలుగులోకి వచ్చిన సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. బాధితురాలి భర్త ఈదన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. అయితే ఈ సంఘటనపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. కీలక సూత్రధారి ఒక ప్రధాన పార్టీకి మద్దతుదారు కావడంతో ఆయనతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేయడం లేదని చెంచులు ఆరోపిస్తున్నారు.

మహిళపై తీవ్రంగా దాడి చేసిన గేదె- కొమ్ములతో రోడ్డుపై ఈడ్చుకెళ్లి! - Buffalo Attack Video

మహిళా కానిస్టేబుల్​పై ఖాకీచకుడు దాడి - సర్వీస్ నుంచి శాశ్వత​ తొలగింపు - Kaleshwaram SI BhavaniSen Dismissed

Last Updated : Jun 22, 2024, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.