ETV Bharat / state

దసరా రోజున జంక్​ఫుడ్​కు స్వస్తి చెప్పండి - ఈ అహార అలవాట్లతో మంచి ఆరోగ్యాన్ని పొందండి - HEALTHY FOOD HABITS IN DUSSEHRA

దసరా పండుగ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి - ఆరోగ్య విజయ దశలు ఏంటి? - ఆనందంగా ఆరోగ్యంగా జీవించేందుకు నిపుణుల సూచనలు

Healthy Food Habits In Dussehra
Healthy Food Habits In Dussehra (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2024, 4:58 PM IST

Healthy Food Habits In Dussehra Season : చెడుపై విజయం సాధించడమే ‘దశ’హరా(దసరా) పండుగ. కాలక్రమేణా వ్యవహారంలో దసరాగా స్థిరపడింది. మహాభారత, రామాయణ, ఇతిహాసాల్లోనూ ఈ పండుగకు సంబంధం కనిపిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి రాక్షస సంహారం చేసి రావణుడిపై విజయం సాధించిన దినంగా రామాయణంలో ప్రస్తావించారు. పంచ పాండవులు ధర్మానికి కట్టుబడి అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని కౌరవ సంహారానికి ఉద్యుక్తులవుతూ విజయ సాధన కోసం జమ్మి చెట్టు మీద దాచిన తమ ఆయుధాల్ని కిందికి దించిన దినంగా విజయదశమిని భావిస్తారని మహాభారతంలో ఇందుకు సంబంధించిన ప్రస్తావన ఉంది.

శరదృతువులో తేలికైనట్లు సమస్యా మేఘావృతమైన మనసు గణపతి ఆరాధనతో ఆపదల్ని తొలగించుకుని శరత్కాల మేఘంలాగా స్వచ్ఛమైన, తేలికైన మనసుతో జగన్మాత ఆరాధనకు సన్నద్ధమవుతున్నవేళ ఇది. ఈ శుభ తరుణంలో అమ్మవారి వైభవాన్ని కీర్తించుకునేందుకు వీలుగా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తాం. నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు మాత్రమే కాదు తొమ్మిది పగళ్లు. అని కూడా అర్థం. తొమ్మిది రాత్రుల తర్వాత వచ్చే పగలే విజయదశమిగా భావిస్తారు.

అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజున దశ దుర్గుణాలు సంహరించినందుకు ఈ పేరు వచ్చింది. బద్దకం, అతిగా తినడం, కాలు కదపకపోవడం, ‘మత్తు’కు బానిస అవ్వడం, సోషల్ మీడియాలో గంటల తరబడి గడపటం వంటి దుర్గుణాలను అంతమొందించుకోవడానికి ఓ లక్ష్యాన్ని పెట్టుకుందాం. దసరా నుంచే తొలి అడుగు వేద్దాం.

డ్రైఫ్రూట్స్​ ఎంతో మధురం : ఎండు ఫలాలు(డ్రైఫ్రూట్స్) తినేవారి సంఖ్య పెరగడంతో ఇటీవల పెద్ద దుకాణాలు వెలుస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రకరకాల డ్రైఫ్రూట్స్ తెప్పిస్తున్నారు. జీడిపప్పును గోవా నుంచి, ఆల్‌మండ్స్‌ (బాదం), పిస్తా కాలిఫోర్నియా, ఎండు ద్రాక్ష, అంజీరాను ఆఫ్ఘనిస్తాన్, ఖర్జూరాలో అజ్వ రకం, మెడ్జల్‌ రకాలను సౌదీ అరేబియాలోని మదీనా నుంచి తెప్పించి ఇక్కడి షాపుల్లో విక్రయిస్తున్నారు. ఆల్‌మండ్స్‌, మమ్రా ఇరాన్‌ నుంచి, ఆఫ్రికాట్‌ బోల్ట్‌ (ఖుబానీ) టర్కీ, వాల్‌నట్స్ కశ్మీర్‌ నుంచి, పొమేలా (ఎండిన నారింజ పండు) ఏషియన్‌ ఫ్రూట్స్‌ను మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక దేశాల నుంచి, బ్లూ బెర్రీస్‌ యూరప్‌ నుంచి, గోల్డెన్‌ కివీ డ్రైడ్, గువా డ్రైడ్‌ (ఎండిన జామ) మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, కుంకుమ పువ్వు, జాపత్రి కశ్మీర్‌ లాంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు.

ఆరోగ్య సిరి సంపదలు : మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి అవసరమైన పీచు పదార్థం (ప్రతి ఒక్కరికీ రోజుకు 38 గ్రాములు ఫైబర్​ అవసరం) ఇది ఎక్కువగా సిరి ధాన్యాల నుంచే లభిస్తుంది. ఓ 10 గ్రాములు కూరగాయలు, ఆకుకూరల నుంచి లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో(ప్రపంచ ఆరోగ్య సంస్థ), ఐసీఎంఆర్‌(ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) లెక్కల ప్రకారం ఒక వ్యక్తికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు రోజుకు 400 గ్రాములు, బియ్యం 190 గ్రాములు, పప్పు ధాన్యాలు 40 గ్రాములు అవసరమవుతాయి. 5 వ్యక్తులున్న కుటుంబానికి 200 గ్రాముల పప్పుధాన్యాలు, రెండు పూటలకు కిలో బియ్యం, అర కిలో పండ్లు, కిలోన్నర కూరగాయలు, ఆకుకూరలు కావాలి.

జంక్​ఫుడ్ తెగతినేస్తున్నారు : దైనందిన జంక్‌ఫుడ్‌ లేనిదే రోజు గడవడం లేదు. ఉమ్మడి జిల్లాలో చాలా మంది 3000- 4,000 క్యాలరీలు ఒంట్లోకి పంపిస్తున్నారు. దసరా పండుగ వేళ పిండివంటలు, మిఠాయిలతో మరిన్ని క్యాలరీలు ఒంట్లోకి వెళ్లనున్నాయి.

క్యాలరీలు ఖర్చు చేయాలండీ : దేహంలోని అదనపు క్యాలరీలను ఎప్పటికప్పుడు ఖర్చు చేయకపోతే శరీరంలో వేర్వేరు భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో పొట్ట పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదముంది. చాలా మంది బద్దకంతో వ్యాయామంను వాయిదా వేస్తుంటారు. ఫలితంగా టైప్‌-2 మధుమేహం, క్యాన్సర్‌ లాంటి వ్యాధుల బారినపడే ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారని కర్నూలు సర్వజన ఆసుపత్రి న్యూట్రీషియన్‌ రవీంద్ర తెలిపారు. క్యాలరీలను తగ్గించుకొనే కొన్ని చిట్కాలను ఆయన తెలిపారు.

రోజుకు ఎంత శక్తి అవసరం : రోజువారీ అవసరాలకు ఆరోగ్యకరమైన పురుషులకైతే 2,600-2,800 కిలో క్యాలరీల వరకు, స్త్రీలకు అయితే 2,200-2,400 వరకు సరిపోతాయి.

  • షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినప్పుడు 5 నిమిషాలపాటు మెట్లపై నడిస్తే 51 క్యాలరీలు వరకు ఖర్చవుతాయి.
  • కూర్చొని ఫోన్‌ మాట్లాడే బదులు గది, బాల్కనీ మేడపై నడుస్తూ మాట్లాడటం మంచిది.
  • టీవీ చూసేటప్పుడు రిమోట్‌ను దూరంగా పెట్టండి. ఛానల్‌ మార్చాలనుకున్నప్పుడల్లా వెళ్లి తెచ్చుకోండి.
  • షవర్‌ స్నానం కాకుండా బకెట్‌లోని నీటిని మగ్‌తో తీసుకుని స్నానం చేయడం వల్ల ఇంకొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి.
  • ఒకట్రెండు అంతస్తుల వరకు ఎక్కాలంటే లిఫ్ట్‌లో వెళ్లడం కాకుండా మెట్ల మార్గాన్నే ఉపయోగించండి. ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
  • నిత్యం 30 నిమిషాలపాటు సైకిల్‌ తొక్కడం వల్ల దాదాపు 75 నుంచి 670 అదనపు క్యాలరీలు ఖర్చువుతాయట.
  • స్నానం చేసేటప్పుడు పాటలు పాడితే అదనంగా 42 క్యాలరీలు ఖర్చవుతాయి.
  • ఛలోక్తి విసిరినప్పుడు హాయిగా నవ్వుకోండి. టీవీలో హాస్య సన్నివేశాలు చూసి గట్టిగా నవ్వండి.
  • కంప్యూటర్‌ ముందు విధులు నిర్వహించేవారు మధ్యమధ్యలో లేచి నిల్చుండటం... నడవటం వంటివి చేయాలి
  • ఉదయం పళ్లు తోముకునే సమయంలో ఒంటి కాలిపై నిల్చోవాలి.

దసరా పండుగ పాఠాలు - సర్కార్ కొలువు సాధించాలంటే - ఇవీ పాటించాల్సిందే

దసరా రోజు మటన్​ వండాల్సిందే! సరిగా ఉడకట్లేదా? ఇలా చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.