ETV Bharat / state

ఇసుకను ఇకపై ట్రాక్టర్​లోనూ తీసుకెళ్లొచ్చు

ఏపీ ఉచిత ఇసుక విధానంలో మార్పులు - ఉత్తర్వులు జారీ చేసిన గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా - రీచ్‌ల నుంచి ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్లలో కూడా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి.

Changes In Free Sand Policy In AP
Changes In Free Sand Policy In AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 8:26 PM IST

Updated : Oct 18, 2024, 9:55 PM IST

Changes In Free Sand Policy In AP : ఆంధ్రప్రదేశ్​లో ఉచిత ఇసుకపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవసరాలకు రీచ్‌ల నుంచి గతంలో ఎడ్లబండ్ల ద్వారానే ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఉండేది. ప్రస్తుతం రీచ్‌ల నుంచి ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్లలో కూడా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

జరిమానాలు ఉండవు : అదే విధంగా ఉచిత ఇసుకకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం సైతం తీసుకుంది. ఇసుకపై సీనరేజ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని సీఎం తెలిపారు. ఉచిత ఇసుకపై టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో ఈ మేరకు సీఎం కీలక ప్రకటన చేశారు.

ఇసుక తవ్వకాలకు అనుమతులు : ఇటీవల పట్టా భూముల్లో కూడా ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పట్టా భూములతో పాటు, డీకేటీ భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన గైడ్ లైన్స్​ను జారీ చేస్తూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.

అందుబాటులో కొత్త ఇసుక రీచ్​లు : మరోవైపు కొత్తగా 108 ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నదుల్లో ఉద్ధృతి దృష్ట్యా తొలివిడత వినియోగంలోకి 40 ఇసుక రీచ్‌లు తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుక కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. జిల్లా కమిటీలు నిర్ణయించిన ధరకు పట్టా భూముల్లోని ఇసుక పొందవచ్చు. వీటితో పాటు నదీ తీర ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఉంటే అధికారులు గుర్తింపు ఇవ్వనున్నారు.

ఇసుక తిన్న పోలీసులు!! - ఏకంగా 16 మందిపై యాక్షన్ - DEPARTMENT ACTION AGAINST POLICE

Sand Mining Effects : ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున 'ఇసుక' తవ్వకాలు.. భవిష్యత్తులో తీవ్ర నష్టం తప్పదు!

Last Updated : Oct 18, 2024, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.