ETV Bharat / state

చంద్రబాబుకు అభినందనలు తెలిపిన జూనియర్‌ ఎన్టీఆర్‌ - థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చిన సీబీఎన్ - Chandrababu Reply to Jr NTR Post

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 12:41 PM IST

Updated : Jun 6, 2024, 2:17 PM IST

Junior NTR Congratulated Chandrababu : ఏపీ ఎన్నికల్లో కూటమి విజయంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఎక్స్‌లో ఎన్టీఆర్‌కు థ్యాంక్స్​ చెప్పారు.

Junior NTR Congratulated Chandrababu
Junior NTR Congratulated Chandrababu (ETV Bharat)

Chandrababu Reply to Jr NTR Tweet : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తనకు విషెస్ చెప్పిన వారికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో రిప్లై పెట్టారు. తనకు అభినందనలు తెలిపిన సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పారు.

ఈ మేరకు ఎక్స్ (ట్విటర్‌)లో జూనియర్‌ ఎన్టీఆర్‌ పెట్టిన ట్వీట్‌కు ‘Thank you very much Amma!’ అని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్‌తో పాటు రజనీకాంత్‌, వెంకటేశ్‌, మోహన్‌బాబు, నాగార్జున, మహేశ్‌బాబు, సోనూసూద్‌కు థ్యాంక్స్ చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తదితరులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Junior NTR Wishes to Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై బుధవారం నాడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రియమైన మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ' నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ' చంద్రబాబుకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఆయన విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేశ్, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణకు, ఎంపీలుగా గెలిచిన భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి విషెస్ చెప్పారు. వీరితోపాటు ఇంతటి ఘన విజయం సాధించిన పవన్​ కల్యాణ్​కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తారక్ ఎక్స్​లో ట్వీట్ చేశారు. కూటమి విజయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించడంతో తెలుగుదేశం అభిమానులు, జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు.

Nandamuri Kalyan Ram Wishes to CBN : నందమూరి కల్యాణ్ రామ్ కూడా చంద్రబాబు నాయుడు విజయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ను కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబుకు, నేతలు, కార్యకర్తలకు కల్యాణ్‌ రామ్ అభినందనలు తెలిపారు.

బాస్​ ఈజ్​ బ్యాక్​ - కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్​ 'మిస్టర్​ నాయుడు' - cbn king maker in lok sabha election 2024

Last Updated : Jun 6, 2024, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.