ETV Bharat / state

నేడే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం - దారులన్నీ కేసరపల్లికే! - Chandrababu Oath Ceremony as AP CM - CHANDRABABU OATH CEREMONY AS AP CM

AP CM Oath Ceremony Arrangements : ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమానికి కృష్ణా జిల్లా కేసరపల్లిలోని సభాప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఇవాళ 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ ప్రధాని, కేంద్ర మంత్రులు, చిరంజీవి, రజినీకాంత్‌ సహా అత్యంత ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

Chandrababu Naidu Oath Ceremony as AP CM
AP CM Oath Ceremony Arrangements (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 9:01 AM IST

నేడే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం - రానున్న అతిరథ మహారథులు (ETV Bharat)

Chandrababu Naidu Oath Ceremony as AP CM : ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రమాణస్వీకారోత్సవానికి అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అగ్రనటులు చిరంజీవి, రజినీకాంత్‌ సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి భారీ ఏర్పాట్లు చేశారు. కూటమిలోని మూడు పార్టీల నుంచి ఎంపికైన ప్రజాప్రతినిధులు సహా నేతలు, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు.

ఈ అంశాల్నింటినీ దృష్టిలో ఉంచుకుని గత నాలుగు రోజులుగా గన్నవరం మండలం కేసరపల్లిలో చేస్తున్న ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయి. సభ కోసం 11.18 ఎకరాలను సిద్ధం చేశారు. మొత్తం 36 గ్యాలరీలను ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లు నిర్మించారు. ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపరించేలా భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో మూడు షెడ్లను సిద్దం చేశారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలు సిద్ధం చేశారు. మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజల కోసం కేటాయించారు.

పార్కింగ్‌ కోసం 56 ఎకరాలు : వాహనాల పార్కింగ్‌ కోసం సభా వేదికకు సమీపంలోని వివిధ చోట్ల 56 ఎకరాలను కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద రోడ్డులోని ఎస్​ఎల్​వీ సమీపంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం సభా వేదికకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి. వేదిక నుంచి 700 మీటర్ల దూరంలోని ఎలైట్ విస్టా వద్ద రెండో పార్కింగ్‌ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు వైపు నుంచి వచ్చే వారి కోసం సభా వేదికకు 730 మీటర్ల దూరంలో మరో పార్కింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేశారు. మేధా టవర్స్‌ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్‌ ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న బండి సంజయ్‌ - Bandi Sanjay Attend AP CM Oath 2024

ప్రమాణస్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రత చర్యలు చేపట్టారు. దాదాపు 10 వేల మంది భద్రత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలో ప్రముఖులు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి. కేంద్ర మంత్రి అమిత్‌షా, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, చిరంజీవి సహా పలువురు వీఐపీలు బెజవాడ మీదుగా కార్యక్రమానికి వెళ్తున్నందున నగరంలో 3 వేల మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు. గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7 వేల మందికి రక్షణ విధులు అప్పగించారు.

పకడ్బందీగా సభా ప్రాంగణ ఏర్పాట్లు : కార్యక్రమంలో భద్రతపరంగా లోపాలు తలెత్తకుండా పకడ్బందీ నిర్వహణకు 60 మందికి పైగా ఐపీఎస్‌ అధికారులను నియమించారు. డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ట్రెయినీ ఐపీఎస్‌లు కూడా వచ్చారు. వీవీఐపీల వాహన శ్రేణి నేరుగా వేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లు నిర్మించారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన సిబ్బంది వేదికతోపాటు ప్రాంగణాన్ని మెటల్‌ డిటెక్టర్లు, జాగిలాలతో అణువణువూ జల్లెడ పట్టారు. అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

ప్రమాణస్వీకారోత్సవానికి అన్ని నియోజకవర్గాల నుంచి మూడు పార్టీల అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ప్రాంగణంలో పరిమితంగా అవకాశం ఉండటంతో పక్కనే ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పాస్‌లు ఉన్నవారినే చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైకి అనుమతించనున్నారు. సభకు వచ్చేవారు లగేజీని వాహనాల్లోనే ఉంచి ప్రాంగణంలోకి రావాలని స్పష్టం చేశారు. సభా వేదిక అలంకరణ బాధ్యతను ఉద్యానశాఖకు అప్పగించారు. వేదిక అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు వివిధ రకాల పూలను బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. వేదికతోపాటు వీవీఐపీల విశ్రాంతి గదులనూ పూలతో అలంకరించారు.

24 మందితో ఏపీ మంత్రుల జాబితా - డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - AP New Cabinet Ministers List

ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ జగన్‌కు చంద్రబాబు ఫోన్‌ కాల్‌ - Chandrababu Phone Call to YS Jagan

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.