ETV Bharat / state

ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా వైసీపీ తప్పుడు వీడియోలు - ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి : చంద్రబాబు - CBN ON FAKE VIDEOS - CBN ON FAKE VIDEOS

YCP Fake Videos : వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా, ఆ ఛానల్ పేరుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తోందని పేర్కొన్నారు. ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో, తాడేపల్లిలో ఫేక్ ఫ్యాక్టరీ నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

YCP Fake Videos
CBN ON FAKE VIDEOS
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 6:53 PM IST

YCP Fake Videos : వైఎస్ జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించారని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెల్లడించారు. అందుకే వైసీపీ తప్పుడు వీడియోలు సృష్టించే ఫేక్ పరిశ్రమను తెరపైకి తెచ్చిందని ధ్వజమెత్తారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ ఛానల్ పేరుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని, చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు నమ్మే వార్తా ఛానల్ పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తే, అంతా నమ్మేస్తారనే దుస్థితికి వైసీపీ దిగజారిపోయిందని దుయ్యబట్టారు.

తప్పుడు ప్రచారాలను ఎండగట్టాలి: పార్టీ ముఖ్యనేతలతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహలపై చర్చించారు. అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పేర్కొన్నారు. ప్రజలు నమ్మే వార్తా ఛానల్ పేరుతో తప్పుడు వీడియోల ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో ను సైతం వదలట్లేదు : వైసీపీ ఫేక్ ప్రచారాలను (Fake campaign) ధీటుగా తిప్పికొడుతూ, సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫేక్ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను సైతం వదలట్లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల ఇలా ఫేక్ ప్రచారానికి ఏదీ అనర్హం కాదన్నట్లు, వైసీపీ తీరుందని ఆక్షేపించారు.

'ఓపెనింగ్స్ ఫుల్​ - కలెక్షన్స్ డల్‌' - ఏపీ రాజకీయాలపై కేవీపీ, బ్రహ్మానందం ఛలోక్తులు - AP politics

పదివేలు ఇస్తామంటే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు: ఎన్నికల వేళ వాలంటీర్లతో తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని జగన్ చూస్తున్నాడని, చంద్రబాబు ఆరోపించారు. వాలంటీర్లను 5 ఏళ్లు బానిసలుగా మార్చి ఊడిగం చేయించుకున్నాడని విమర్శించారు. వాలంటీర్లకు తెలుగుదేశం ప్రభుత్వం పది వేలు ఇస్తామంటే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ దాడుల్ని (CP Attacks) సమర్థంగా తిప్పికొట్టి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి ఎవరైతే అతనికి మూడు పార్టీల ఓట్లు పడేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

రోడ్ షో వైసీపీ నేతలకు నిద్రలేకుండా చేసింది: తాను పవన్ కళ్యాణ్ కలిసి నిర్వహించిన రోడ్ షోకు, ప్రజా స్పందన సూపర్ సక్సెస్ అని అభిప్రాయపడ్డారు. తణుకు సభతో తాడేపల్లి ప్యాలెస్​ను వణికిస్తే, నిడదవోలు రోడ్ షో వైసీపీ నేతలకు నిద్రలేకుండా చేసిందని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలకు అందరం కలిసి ఇష్టపడుతూ కష్టపడితే ఊహించని ఫలితాలు వస్తాయని తేల్చిచెప్పారు. ప్రతీ కుటుంబ సాధికార సభ్యులు ఈ 32 రోజుల్లో రోజుకు 50 ఇళ్లు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

వైసీపీ తప్పుడు వీడియోలు - తెరపైకి ఫేక్​ పరిశ్రమ : చంద్రబాబు

Devineni Uma Allegations on Sajjala Bhargava Reddy : సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలో ఫేక్ ఫ్యాక్టరీ నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తాడేపల్లిలోని నెక్స్ట్ స్పేస్ భవనంలో ఫేక్ వార్తల్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఫేక్ లోగోలు కూడా ఈ భవనం కేంద్రంగా రూపొందిస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు. దాదాపు 300 మందికి ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తూ ఫేక్ వీడియోలు, పత్రాలు సృష్టిస్తున్నారని తెలిపారు.

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Condemn Attack on tdp

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.