Chandrababu Fires on CM Jagan : పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో నిర్వహించిన రా కదలిరా సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సభకు పల్నాడు ప్రాంతం నుంచి జనం పోటెత్తారు. జనప్రభంజనంతో సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. రా కదలిరా సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) టీడీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలని చూసి రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడిన చంద్రబాబు, అధికార పార్టీ దౌర్జన్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారని, పవన్ తన ఆలోచనలు ఒక్కటే అని విభేదాలు సృష్టించలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ నేతలను వదిలేది లేదు : పల్నాడులో చెలరేగిపోతున్న నరహంతక ముఠాని తుదముట్టిస్తానని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు శపథం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మందిని అధికార పార్టీ మూకలు దాడులు చేసి చంపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరో 40 రోజుల్లో వైసీపీ ఇంటికి పోవడం ఖాయమని తేల్చి చెప్పారు. పోలీసుల అండతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైసీపీ నేతలను వదిలేది లేదని స్పష్టం చేశారు.
'సేవ్ ఆంధ్రప్రదేశ్- క్విట్ జగన్'! 'ఓడిపోవడానికే సిద్ధం అంటున్నారు': చంద్రబాబు
పల్నాడు సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా : దళిత ఎమ్మెల్యేలను ఇష్టారీతిన మారుస్తున్న జగన్ మాచర్లలో ఆటవిక రాజ్యాన్ని సాగిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మార్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ మునిగిపోయే పార్టీ అన్న చంద్రబాబు, తెలుగుదేశం - జనసేన అధికారంలోకి రాగానే పల్నాడు సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు.
షర్మిలను టిష్యూ పేపర్‌లా వాడుకున్నాడు : హూ కిల్డ్ బాబాయ్ అనేది జగన్ ఇప్పటికైనా సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబాయ్‌ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని పిలుపునిచ్చారు. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికి రారని, ఎంతో బాధతో అన్న పార్టీకి ఓటు వేయొద్దని జగన్ చెల్లి సునీత చెప్పిందని గుర్తు చేశారు. సొంత చెల్లి షర్మిలకి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా అని ప్రశ్నిచారు. టిష్యూ పేపర్‌లా వాడుకుంటారని, జగన్‌ది యూజ్ అండ్ త్రో విధానమని పేర్కొన్నారు. మహిళ అని చూడకుండా సొంత చెల్లిపై వ్యక్తిత్వహననానికి దిగిన జగన్‌ని ఆడబిడ్డలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు.
నెల్లూరు, పల్నాడు పసుపుమయం- నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వైసీపీ నేతలు
లాజిస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తా : రాష్ట్రానికి ఎంతో కీలకమైన అమరావతి రాజధానిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనేదే తన కల అని వాటిని పూర్తి చేయాలని చంద్రబాబును శ్రీకృష్ణదేవరాయలు కోరారు. తెలుగుదేశం - జనసేన అధికారంలోకి వచ్చాక లాజిస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేసి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.
సభా వేదికపై చంద్రబాబు, పవన్ - పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం