AP CM Chandrababu In NBK Unstoppable Show : 'చనిపోతే ఒకే ఒక్క క్షణం, ఆశయం కోసం పని చేస్తే అదే శాశ్వతం. చావు గురించి అక్కడే ఆగిపోతే ఏదీ చేయలేం. దేన్నైనా సరే ముందుకెళ్లి ఎదుర్కొందామని అనుకున్నా'. రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడు తన మనసులో మెదిలిన భావాలివే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జైల్లో ఎప్పుడూ సందేహాస్పద ఘటనలు జరిగాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నందుకే ఈరోజు వరకు తన జోలికి ఎవరూ రాలేకపోయారని తెలిపారు. తాను అలా లేకపోయి ఉంటే, ఏం జరిగేదో ఊహించుకోవటమే కష్టంగా ఉందని, చరిత్రే మరో మాదిరిగా ఉండేదేమోనని అన్నారు.
జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చాక కూడా ఆ ఘటనలన్నీ నిరంతరం తన మనసులో తిరిగేవని ఉద్వోగానికి లోనయ్యారు. ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆహా ఓటీటీలో ప్రాసరమయ్యే అన్‌స్టాపబుల్ షోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం ప్రసారమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తన అరెస్టు, జైల్లో గడిపిన రోజులు, పవన్ కల్యాణ్‌తో పొత్తు తదితర అంశాలపై బాలయ్య ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు.
పవన్ కల్యాణ్, బాలయ్యకు 'దండుమల్కాపురం'తో ఏంటి సంబంధం?
ఎప్పుడు అలా వ్యవహరించలేదు : తన అరెస్టు ఘటనను ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నట్లు చంద్రబాబు అన్నారు. తాను ఎప్పుడు తప్పు చేయలేదని, నిప్పులా బతికానన్న ఆయన తప్పకుండా ప్రజలు మద్దతిస్తారని విశ్వాసంతే ఉన్నట్లు తెలిపారు. ఆ నమ్మకమే ఆయన్ను మళ్లీ గెలిపిస్తుందని, అదే ఇవాళ ప్రజల ముందు సీఎంలా నిలంబెట్టిరాని చెప్పారు. అరెస్టు చేస్తారనో, ప్రాణం పోతుందోనని భయపడితే అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చలేమన్నారు. తన జీవితంలో ఎన్నడూ రాజకీయ కక్షతో వ్యవహరించలేదని తెలిపారు.
కక్షపూరిత రాజకీయాలు : గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో గొడవలు చేస్తూ రెచ్చిపోయినా తాన సంయమనం పాటించినట్లు గుర్తుచేసుకున్నారు. ఆయన సీఎం అయ్యాక తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తనపై దూకుడుగా మాట్లాడితే హెచ్చరించినట్లు చెప్పారు. ఆయన తగ్గి క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా కక్షపూరిత రాజకీయాలు పురుడుపోసుకున్నాయని, వ్యక్తిగత ద్వేషాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తాను ఎప్పటికి లక్ష్మణరేఖ దాటనని, తప్పుచేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించిన ఆయన తప్పు చేయనివారి జోలికి వెళ్లలని స్పష్టం చేశారు.
" ‘పవన్‌కల్యాణ్ జైల్లో నన్ను కలిసి ‘ధైర్యంగా ఉన్నారా?’ అని అడిగారు. నా జీవితంలో ఎప్పుడూ అధైర్యంగా ఉండనని, దేనికీ భయపడనని చెప్పాను. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు చూస్తున్నానని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ప్రయత్నిస్తానని నాతో ఆయన అన్నారు. అలాంటప్పుడు అందరం కలిసి పోటీ చేద్దామని.. దానిపై ఆలోచించాలని నేను ప్రతిపాదించా. పవన్ కల్యాణ్ వెంటనే దానికి అంగీకరించారు. భాజపాకు కూడా నచ్చజెప్పి పొత్తులోకి తీసుకొస్తామన్నారు. అదే విషయాన్ని నన్ను కలిసిన అనంతరం బయటకు వచ్చి మీ (బాలకృష్ణ)తో, లోకేశ్‌తో కలిసి విలేకర్లకు వెల్లడించారు." - చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
అయినా పొత్తు ఉండేదేమో : ఆ క్షణం వారి విజయానికి నాంది పడిందని చంద్రబాబు అన్నారు. మిమ్మల్ని అరెస్టు చేయకపోయి ఉంటే మీ ఇద్దరి మధ్య ఈ పొత్తు కుదిరేదా?’ అని బాలకృష్ణ ప్రశ్నించగా ‘అరెస్టు చేయకపోయినా పొత్తు ఉండేదేమో అని తెలిపారు. తన అరెస్టు ఆ నిర్ణయానికి ఊతమైందన్నారు. ప్రజల ఆకాంక్షను సరైన సమయంలో పవన్ కల్యాణ్ ప్రతిబింబించారని గుర్తుచేశారు. వారంతా నిమిత్తమాత్రులమన్న ఆయన విధి స్పష్టంగా ఉంటుందని ’ చంద్రబాబు సమాధానమిచ్చారు.
'అన్‌స్టాపబుల్' సీజన్ 4 - ఫస్ట్ ఎపిసోడ్‌లోనే పవర్ఫుల్ గెస్ట్-ఎవరంటే?