ETV Bharat / state

ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతానికి పార్టీలు సహకరించాలి : సీఈవో సుదర్శన్​రెడ్డి - CEO Meeting With Political Parties

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 9:58 PM IST

CEO Meeting With Political Parties : రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల నమోదు పురోగతిపై రాజకీయ పార్టీలతో సీఈవో సుదర్శన్ రెడ్డి తన కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 11 రాజకీయపార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేందుకు ప్రక్రియను సులభతరం చేయనున్నట్లు తెలిపారు.

CEO Meeting With Political Parties
CEO Meeting With Political Parties (ETV Bharat)

CEO Meeting With Political Parties : ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతును చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి (సీఈవో) సుదర్శన్​రెడ్డి కోరారు. ఇవాళ బీఆర్‌కె భవన్‌లో ఆయన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల నమోదు కార్యక్రమ పురోగతిపై చర్చించారు. సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆమ్ అద్మీ పార్టీ తదితర పార్టీలకు చెందిన 11మంది ప్రతినిధులు పాల్గొన్నారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ల నమోదు చేసుకునేందుకు ప్రక్రియను సులభతరం చేయనున్నట్లు తెలిపారు.

ఓటరు నమోదు ప్రక్రియ మరింత సులభం : ఇంటింటికీ వెళ్లి ప్రచారంలో బూత్ లెవల్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని సుదర్శన్​రెడ్డి తెలిపారు. బీఎల్​ఓలు కూడా ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాలను నవీకరించడంలో, సరిదిద్దడంలో, పోలింగ్ బూత్‌లలో ఓటరు పంపిణీని హేతుబద్ధీకరించడం, రాష్ట్రవ్యాప్తంగా ఓటరు నమోదులో మెరుగుదల తీసుకురానున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ఓటర్లు త్వరితగతిన, సులభమైన, అవాంతరాలు లేని క్యూఆర్​ కోడ్‌ను స్కాన్ చేయడానికి ఈసీఐ అనుమతించడంతో ఓటరు నమోదు ప్రక్రియ మరింత సులభతరమైందన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు నిర్మాణాత్మక సూచనలు అందించారన్నారు. గరిష్ఠ ఓటరు భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి దోహదం చేస్తున్నారు.

జనవరి 6న ఓటర్ల తుది జాబితా ప్రచురణ : సీఈవో సి. సిదర్శన్ రెడ్డి

జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలి: ప్రధాన ఎన్నికల అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.