Central Govt Releases Funds for Polavaram: పోలవరం పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు నిధుల కొరత తీరేలా కేంద్రం శుభవార్త అందించింది. 2 వేల 800 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. పాతబిల్లుల రీయింబర్స్‌మెంట్ కింద 800 కోట్లు, పనులు చేపట్టేందుకు అడ్వాన్సుగా 2వేల కోట్లు ఇచ్చినట్లుగా ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి తొలుత రాష్ట్రప్రభుత్వం నిధులు ఖర్చుచేస్తే రీఎంబర్స్ చేస్తున్నకేంద్రం తొలిసారి అడ్వాన్స్‌గా ఇచ్చింది. జగన్ హయాంలోనూ అడ్వాన్సుగా నిధులు ఇవ్వాలని పదేపదే కోరినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు తొలిసారిగా అంగీకారం తెలిపిన మోదీ సర్కారు తాజాగా ఆ మాట నిలబెట్టుకుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్ణయాలు, నిధుల విషయంలో కేంద్రం వేగంగా అడుగులు నెల క్రితమే 30,436 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కొత్త డీబీఆర్ను కేంద్రం ఆమోదించింది. ఫలితంగా గతంలో ఇచ్చిన నిధులు పోను 12,157 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు వీలు చిక్కింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లు, వచ్చే ఏడాది 6,157 కోట్లు అడ్వాన్స్‌గా మంజూరు చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.7 వేల కోట్ల వరకు అవసరమని పోలవరం అధికారులు చెబుతున్నారు.
"అరకు కాఫీ" అదుర్స్ - రైతుల కష్టాలకు చెక్ పెట్టిన టెకీ నిర్ణయం
పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకు కేంద్రం నుంచి 1,615.47 కోట్ల రూపాయలు రాష్ట్రానికి బకాయిల రూపంలో రావాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం రూ.1,615.47 కోట్ల విలువైన పనులు చేసినప్పటికీ అందులో గుత్తేదారులకు చెల్లించిన మొత్తం 800 కోట్ల రూపాయలే. పైగా పాత డీపీఆర్ ప్రకారం ఆ నిధులు ఇచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ప్రస్తుతం కొత్త డీపీఆర్ ఆమోదం పొందడంతో అందులో నిధులు తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెల్లించి, బిల్లులు కూడా సమర్పించిన రూ.800 కోట్లు రీయింబర్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే రూ.2,000 కోట్లు తక్షణమే అడ్వాన్స్‌గా కావాలని అడిగినందున ఆ మొత్తమూ ఇచ్చి ఉంటారని పోలవరం అధికారులు అనుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యాక కేంద్రం నుంచి ఇంత వేగంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవడం, నిధులు మంజూరు కావడం ఇదే తొలిసారని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామంపై గుత్తేదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లిక్కర్ లక్కు ఎవరికో! - మద్యం షాపుతో జాతకం మారేనా? - రాయబారాలు ఫలించేనా!
"మన దగ్గర బేరాల్లేవమ్మా!" - భయపెడుతున్న రైతు బజార్ మార్కెట్ రేట్లు