ETV Bharat / state

రాష్ట్రానికి కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు - ఎక్కడెక్కడంటే? - SEVEN NEW RESIDENTIAL VIDYALAYAS

తెలంగాణలో ఏడు నవోదయ విద్యాలయాలకు కేంద్రం ఆమోదం - 1993 తర్వాత ఇదే మొదటిసారి - నవోదయ విద్యాలయాలు తెలంగాణకు కేటాయించడంపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి హర్షం

New Residential Vidyalayas in Telangana
New Residential Vidyalayas in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2024, 1:43 PM IST

New Residential Vidyalayas in Telangana : తెలంగాణలో 7 జవహర్​ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ అధ్యక్షతన దిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల యావత్​ తెలంగాణ ప్రజలతో పాటుగా, వ్యక్తిగతంగా తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో నూతన జవహర్​ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ను పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

దాదాపు రూ.340 కోట్లతో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో 4000 విద్యార్థులు ఇందులో చదువుకోవచ్చని కిషన్​ రెడ్డి అన్నారు. అలాగే 6 నుంచి 12వ తరగతి వరకు హాస్టల్​ వసతితో సహా అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. మరోవైపు 330 మందికి కొత్తగా ఉపాధి లభించనుందన్నారు.

కేబినెట్​ మీటింగ్​ : శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్​ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్​ కమిటీ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 7 నవోదయాలను తెలంగాణకు కేటాయించింది. ఈ 28 విద్యాలయాల ఏర్పాటుకు 2024-29 మధ్యకాలంలో సుమారు రూ.2,359 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

జవహర్​ నవోదయ విద్యాలయాలు :

  • ఈ విద్యాలయాల ఏర్పాటుకు 2024-29 మధ్యకాలంలో సుమారు రూ.2,359 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
  • ఇందులో మూల ధన వ్యయం రూ.1,944 కోట్లు కాగా, పాఠశాలల నిర్వహణకు రూ.415 కోట్లు
  • ఇవి పూర్తిస్థాయి రెసిడెన్షియల్ పాఠశాలలు
  • ఇక్కడ బాల, బాలికలు ఉమ్మడిగా చదువుకోవడానికి వీలు
  • గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యధికంగా అవకాశం
  • ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు
  • 6 నుంచి 12వ తరగతి వరకు ప్రతిభావంతమైన విద్యార్థులకు నాణ్యమైన విద్య

30 ఏళ్ల తర్వాత ఇప్పుడే మంజూరు : 1993 తర్వాత కొత్త నవోదయ పాఠశాలలు తెలంగాణకు మంజూరు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏర్పాటైన పాఠశాలల్లో 1986-87లో రెండు, 1987-88లో ఐదు, 1991-92లో ఒకటి, 1993-94లో మరొకటి ఏర్పాటు అయ్యారు. ఆ తర్వాత ఒక్కటీ కూడా తెలంగాణకు రాలేదు. తాజాగా 2024-25లో ఏకంకా ఏడు రెసిడెన్షియల్​ పాఠశాలలను మంజూరు చేశారు. ఇప్పటికే ఉన్న 9 పాఠశాలల్లో 4,287 మంది చదవగా వారిలో బాలలు 2,566, బాలికలు 1,721 మంది ఉన్నారు. వారిలో గ్రామీణ విద్యార్థులు 3,684, పట్టణ ప్రాంతవాసులు 603 మంది ఉన్నారు.

7 కొత్త విద్యాలయాలు :

  • నిజామాబాద్​
  • జగిత్యాల
  • మేడ్చల్​-మల్కాజిగిరి
  • భద్రాద్రి కొత్తగూడెం
  • సంగారెడ్డి
  • సూర్యాపేట
  • మహబూబ్​నగర్​

ఇప్పటికే ఉన్న పాత విద్యాలయాలు : కరీంనగర్​, కుమురంభీం ఆసిఫాబాద్​, నాగర్​కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వరంగల్​, రంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.