Cell Phone Usage Disadvantages in Telugu : ఈతరం ఆధునిక సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్ స్మార్ట్‌ఫోన్. కరోనా సమయంలో మొదలైన ఆన్లైన్ తరగతులతో ఒక్క కుటుంబంలో సెల్ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు దాన్ని అవసరానికంటే వాడేవారి సంఖ్యే ఎక్కువ. సరైన మార్గంలో వాడిన వారికి అసరగా నిలుస్తుంది, వారి సంఖ్య కూడా తక్కువే. సెల్‌ఫోన్‌ను వినియోగిస్తే వ్యక్తిగతంగా వృత్తిపంరగా అసమర్థులుగా చేస్తోందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. శారీరల, మానసిల సమస్యలతో తమ వద్దకు వచ్చిన వారు ఏదో ఒక విధంగా తమకు మొబైల్ వినియోగంతో సంబంధం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తిస్తున్నామని ఆందోళన వ్య్కతం చేశారు. అకస్మాత్తుగా ప్రవర్తనలో ఏదైనా లోపం గుర్తిస్తే వాళ్లు తప్పకుండా ఫోన్లో మునిగినట్లేనని వైద్యులు చెబుతున్నారు.
సెల్‌ఫోన్ వాడకం వల్ల వచ్చే శారీరక ఇబ్బందులు
- స్క్రీన్ చూసే సమయం పెరగడంతో శారీరక శ్రమ తగ్గి అధిక బరువుకు కారణం
- ఊబకాయంతో జీవనశైలి వ్యాధులు రావడం
- రాత్రిళ్లు ఎక్కువ సమయం మేల్కొనడంతో నిద్రలేమి సమస్య
- వినికిడి సమస్యలు
- కళ్లు పొడిబారటం, తలనొప్పి, పార్శ్యపునొప్పి, దృష్టిలోపం రావడం
- రోజూ 6గంటలకు పైగా వాడితే చిటికెన వేలు నొప్పి వస్తుందట (స్మార్ట్‌ఫోన్ పింక్)
- బైక్ నడుపుతూ మెడ ఒక వైపు వంచి ఫోన్ మాట్లాడటంతో మెడనొప్పికి కారణం
- ఎక్కువసేపు మాట్లాడేందుకు ఒకే చేతిని ఉపయోగించటంతో మోచేతినొప్పి వస్తుందట (సెల్‌ఫోన్ ఎల్బో)
"రోజు ఎలాగో ఫోనే చూస్తాం. అందులో మనం మనకు అనవరమైనవి కూడా చూస్తుంటాం. అలాంటివి మానుకోని కాసేపు స్కీన్‌కు బ్రేక్ ఇద్దాం. రోజూ ఒక రెండు గంటలు ఫోన్ ముట్టకుండా విరామం ఇవ్వండి. పిల్లలకు కూడా మెదడుకు పదునుపెట్టేలా ఆటలు, పజిల్స్ లాంటివి ఇస్తే స్ర్కీన్ చూడరిక. సామాజిక మాధ్యమాలు, ఇతర అంశాలు చేసేందుకు నిర్దేశిత సమయాన్ని కేటాయించుకుంటే బాగుంటుంది." - డాక్టర్ గీత చల్లా, మనస్తత్వ విశ్లేషకులు
సెల్‌ఫోన్ అధికంగా వాడుతున్న వారిలో తలెత్తుతున్న మానసిక సమస్యలేంటి అంటే
- జ్ఞాపకశక్తి తగ్గడం
- ఏకాగ్రత లోపించడం
- ఆందోళన, ఆతృత పెరడటం
- తప్పని వారించిన వారిపై శత్రుభావం ఏర్పరుచు కోవడం
- ఆత్మవిశ్వాసం లోపించడం
- అపరాధభావంతో బంధుమిత్రులకు దూరం
- భావోద్వోగాలపై నియంత్రణ కోల్పోవడం
సరైన భంగిమలో కూర్చొని చదవాలి : విద్యార్థులు స్క్రీన్ ఉపయోగించేటపుడు పెద్దవాటిని ఎంపిక చేసుకోవాలని డాక్టర్ దివ్యనటరాజన్ అన్నారు. మెడ, వెన్నుపై ఒత్తిడి పడకుండా సరైన భంగిమలో కూర్చొని చదవాలని సూచించారు. స్క్రీన్ ప్రొటెక్టర్లు ఉపయోగించాలన్నారు. కళ్లు పొడిబారకుండా ప్రతి 20 నిమిషాలకోసారి 20 అడుగుల దూరంలో ఉన్నవాటిని చూస్తూ కంటి కండరాలను కదపాలని తెలిపారు.
ఫింగర్ ప్రింట్, ఐరిస్‌తో కాదు- ఇక శ్వాసతోనే ఫోన్ అన్ లాక్! ఈ టెక్నాలజీ అదుర్స్