CBI Court Adjourned Kavitha Trial to June 3 : దిల్లీ మద్యం కేసులో భాగంగా మనీలాండరింగ్ కేసులో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈనెల 10న మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ, కవిత, చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంది.
ఈడీ అరెస్టుతో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత, చరణ్‌జీత్‌లకు రౌస్ అవెన్యూ కోర్టు, ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌ను అరెస్టు చేయకపోవడం వల్ల, వచ్చేనెల 3న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా వేసింది.