ETV Bharat / state

ఎన్నికల వేళ భారీగా నగదు పట్టివేత - ఏపీలో 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు - 8 CRORES SEIZED IN NTR DISTRICT - 8 CRORES SEIZED IN NTR DISTRICT

Cash Seized in Ntr District: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో లారీలో తరలిస్తున్న 8.40 కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Cash Seized at NTR District in AP
Cash Seized in Ntr District (ETV BHARAT)
author img

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 10:29 AM IST

Updated : May 9, 2024, 3:14 PM IST

Cash Seized at NTR District in AP : ఎన్నికల వేళ ఏపీలోని ఎన్టీఆర్​ జిల్లాలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్ల నగదును సీజ్​ చేశారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్​పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు హైదారాబాద్​ నుంచి గుంటూరుకు లారీలో తరలిస్తుండగా ఈ డబ్బును పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ఏపీలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద అంతర్రాష్ట్ర చెక్​పోస్టు వద్ద పైపుల లారీలో అక్రమంగా తరలిస్తున్న నగదును పట్టుకున్నట్లు నందిగామ ఏసీపీ రవికిరణ్ తెలిపారు. మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు ప్లాస్టిక్ పైపులు లారీలో రవాణా చేసేందుకు వే బిల్లు తీసుకున్నట్టు తెలిపారు. ఈ లారీలో క్యాబిన్​కు వెనుకవైపున ఐదు బాక్సుల్లో డబ్బును తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. గరికపాటి చెక్​పోస్ట్ వద్ద లారీలు తనిఖీ చేస్తుండగా నగదు గుర్తించామని తెలిపారు.

నగదును స్వాధీనం చేసుకొని ఇద్దరు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని, ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి వెళ్తుందో విచారణలో తెలుస్తుందని అన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పైపుల లోడ్​తో వెళ్తున్న లారీ క్యాబిన్లో ఉంచిన రూ. 8.40 కోట్లను సీజ్​ చేశామన్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు.

ఎన్నికల వేళ పోలీసుల సోదాలు - ఇప్పటివరకు రూ.104 కోట్ల నగదు సీజ్​ - HUGE AMOUNT OF CASH SEIZED IN TS

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల తంటాలు - పోటాపోటీగా డబ్బు పంపిణీ చేస్తున్న అభ్యర్థులు

Last Updated : May 9, 2024, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.