ETV Bharat / state

'మార్ఫింగ్ ఫొటోలు-అసభ్యకర పోస్టులు' - ఏ-1, ఏ-2, ఏ-3పై కేసులు నమోదు

సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టిన వర్రాపై కేసులు - ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్రా రవీందర్‌రెడ్డిపై 40 కేసులు నమోదు

Cases_on_Varra_Ravinder_Reddy
Cases on Varra Ravinder Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 7:52 PM IST

Updated : Nov 23, 2024, 10:54 PM IST

Cases on Varra Ravinder Reddy: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వర్రా రవీందర్ రెడ్డిని కడప జైలు నుంచి పీటీ వారంట్​పైన తీసుకెళ్లిన పోలీసులు ప్రొద్దుటూరు కోర్టులో హాజరు పరిచారు. వర్రా రవీందర్ రెడ్డిపై ప్రొద్దుటూరులో కూడా కేసు నమోదు కావడంతో ఈ మేరకు తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ అగ్రనేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు ప్రొద్దుటూరు వన్​టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది.

రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు: ఈనెల 8వ తేదీన పులివెందుల పోలీస్ స్టేషన్​లో నమోదైన అట్రాసిటీ కేసులో వర్రా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇతనిపై వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా పది కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వర్రా కేసులో పలువురు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు, తాజాగా నెల్లూరు, భీమవరం ప్రాంతాలకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, జయరాంలను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిద్దరికీ సోమవారం 41-ఏ నోటీసులు ఇవ్వనున్నారు.

సజ్జల భార్గవ్‌రెడ్డికి 41-ఏ నోటీసులు: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్​ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డికి పోలీసులు 41-ఏ నోటీసులు జారీ చేశారు. విజయవాడ వెళ్లిన పులివెందుల పోలీసులు భార్గవ్ తల్లికి నోటీసులు అందించారు. పులివెందులలో జగన్ బంధువు అర్జున్‌రెడ్డికి సైతం 41-ఏ నోటీసులు ఇచ్చారు. పులివెందులలో అర్జున్‌రెడ్డి ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. ఈ నెల 8వ తేదీన ఐటీ, బీఎన్‌ఎస్‌, అట్రాసిటీ చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఏ-1గా వర్రా రవీందర్‌రెడ్డి, ఏ-2గా సజ్జల భార్గవ్‌రెడ్డి, ఏ-3గా అర్జున్‌రెడ్డి ఉన్నారు. సోమవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. వర్రా రవీందర్‌రెడ్డి కేసులో మరో 15 మందికి కూడా నోటీసులు జారీ చేశారు.

మరోవైపు ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డి ఫేస్​బుక్ నుంచి 43 పేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మార్ఫింగ్ ఫొటోలతో కూడిన అసభ్యకరమైన పోస్టులే వీటిలో ఎక్కువగా ఉన్నాయి. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. దీనికి కంటెంట్ ఎవరు ఇచ్చారు? ఎవరు పోస్టు చేశారు? అనే దానిపై విచారించేందుకు పోలీసులు సంబంధిత వైఎస్సార్సీపీ కార్యకర్తలకు నోటీసులు ఇవ్వనున్నారు.

వైఎస్సార్సీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి లాంటి కార్యకర్తల ఐడీలను తమ వద్దే పెట్టుకుని ప్రత్యర్థులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీటన్నిటిపై సమగ్ర విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు పలువురిని అదుపులోకి తీసుకుని, విచారించారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుంటుండంతో ఆ పార్టీలో గుబులు రేపింది. ఇప్పటికే చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

"ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో?" - అజ్ఞాతంలోకి 'పులివెందుల' వైఎస్సార్సీపీ నేతలు

ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - సెర్చ్ వారెంట్ జారీ

Last Updated : Nov 23, 2024, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.