ETV Bharat / state

ఎమ్మెల్సీ కవిత మామపై కేసు నమోదు - అసలేం జరిగింది? - CASE REGISTER AGAINST KAVITHA UNCLE

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మామపై కేసు నమోదు - కులం పేరుతో వ్యక్తిని దూషించారని పోలీసులకు ఫిర్యాదు - నిజామాబాద్​ గ్రామీణ పోలీస్​ స్టేషన్​లో నమోదైన కేసు

MLC Kavitha Uncle Case
MLC Kavitha Uncle Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

MLC Kavitha Uncle Case : నిజామాబాద్​ నగరంలోని ఓ స్థల వివాదంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మామపై కేసు నమోదు అయింది. నగరంలోని ఓ అపార్ట్​మెంట్​ ఎదుట ఉన్న స్థలాన్ని ఎమ్మెల్సీ కవిత మామ రాం కిషన్​రావు అనుచరులు కబ్జా చేయడాన్ని అడ్డుకున్న వ్యక్తిపై కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కులం పేరుతో దూషించిన కవిత మామ అనుచరులపై, రాం కిషన్​రావుపై గోపీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో గ్రామీణ పోలీస్​ స్టేషన్​లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ స్థల వివాదానికి రాం కిషన్​రావుకి ఎలాంటి సంబంధం లేదని ఆ స్థలం స్వయంగా తానే కొనుగోలు చేశానని కాంగ్రెస్​ నేత మైనంపల్లి హనుమంతరావు బంధువు నగేశ్​ చెప్పారు. స్థలం చదును చేసే క్రమంలో అడ్డుకున్న వ్యక్తిపై, అపార్ట్​మెంట్​ వాసులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.