ETV Bharat / state

పొదుపు సంఘాల సొమ్ము స్వాహా! - మున్సిపల్ వైస్​ ఛైర్​పర్సన్​పై కేసు - Case on municipal Vice Chairperson

Case Filed on municipal Vice Chairperson Gangadevi: సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ వైస్ ఛైర్​ పర్సన్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. పొదుపు సొమ్మును డ్రా చేసుకుని సొంతానికి వాడుకుని తిరిగి చెల్లించలేదన్న ఫిర్యాదు అందటంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Case_Filed_on_Municipal_Vice_Chairperson_Gangadevi
Case_Filed_on_Municipal_Vice_Chairperson_Gangadevi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 12:55 PM IST

Case Filed on Municipal Vice Chairperson Gangadevi: పొదుపు సొమ్మును డ్రా చేసుకుని సొంతానికి వాడుకుని తిరిగి చెల్లించలేదన్న ఫిర్యాదుతో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ వైస్ ఛైర్​ పర్సన్ గంగాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ వైస్ ఛైర్​ పర్సన్ గంగాదేవి గతంలో పొదుపు సంఘాల సమాఖ్య కోశాధికారిగా ఉండేవారు. అప్పటి పొదుపు సంఘాల అధ్యక్షురాలు మెహతాజ్, కార్యదర్శి సులోచన సహకారంతో గంగాదేవి సంఘంలోని మూడు లక్షల రూపాయలను డ్రా చేసుకుని సొంతానికి వాడుకున్నారు.

ఈ విషయాన్ని గుర్తించిన పొదుపు సమాఖ్య మహిళలు డ్రా చేసుకున్న సొమ్మును తిరిగి జమ చేయాలని ఒత్తిడి చేశారు. సమాఖ్య సభ్యుల డిమాండ్​తో ఒక లక్ష 25 వేల రూపాయలను గంగాదేవి పొదుపు సమాఖ్య ఖాతాకు జమ చేశారు. మిగతా సొమ్మును చెల్లించలేదు. మహిళా సంఘాల పొదుపుపై ఇటీవల ఆడిట్​ పూర్తి అయింది. గతంలో కోశాధికారిగా ఉన్న మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గంగాదేవి వాడుకున్న సొమ్ము వడ్డీతో కలిపి రెండు లక్షల 85 వేల రూపాయలు ఆమె పేరిట బకాయి ఉన్నట్లు ఆడిట్ అధికారులు తేల్చారు.

ఆడిట్ నివేదిక ఆధారంగా బకాయి ఉన్న సొమ్మును చెల్లించాలని పొదుపు సమాఖ్య సభ్యులు మున్సిపల్ వైస్ ఛైర్​ పర్సన్​ను కోరారు. ఆమె పట్టించుకోకపోవడంతో సమాఖ్య ప్రస్తుత అధ్యక్షురాలు రిజ్వానా ఫిర్యాదు మేరకు కదిరి పట్టణ పోలీసులు గంగాదేవిపై కేసు నమోదు చేశారు.

డ్వాక్రా సంఘాలకు రూ.80లక్షలు కుచ్చుటోపి పెట్టిన బిజినెస్ కరస్పాండెంట్

లంచం ఇస్తే కానీ లోన్లు ఇవ్వనన్న బుక్ కీపర్ - డ్వాక్రా మహిళలు డిప్యూటీ తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.