Case Filed Against KTR : సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ముఖ్యమంత్రి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Police Case On KTR : స్వయంగా ముఖ్యమంత్రిపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం ప్రతిష్టకు భంగం కలిగే వ్యాఖ్యలు చేశారని అన్నారు. కేటీఆర్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. శ్రీనివాస్ రావు ఫర్యాదు మేరకు కేటీఆర్‌పై హనుమకొండ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటున్నందున కేసును ఇక్కడికి బదిలీ చేశారు. ఇందులో భాగంగా కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Case Against BRS EX MP Joginapally Santosh : మరోవైపు ఇటీవలే బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో నకిలీ పత్రాలు సృష్టించి భూమి కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమ మైనింగ్ కేసు - పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు అరెస్ట్
ఈ కేసుపై సంతోష్‌కుమార్ స్పందించారు. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని అన్నారు. 2016లో తాను శ్యాంసుందర్ ఫుల్జాల్ నుంచి ఆ స్థలాన్ని కొనుగోలు చేశానని ఇందులో ఫోర్జరీ అనే మాటకు తావులేదని స్పష్టం చేశారు. ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయవివాదం తలెత్తలేదని తెలిపారు. తాను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని సంతోష్‌కుమార్ పేర్కొన్నారు.
శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయని సంతోష్‌కుమార్ అన్నారు. ఒకవేళ న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీసు ఇచ్చి వివరణ కోరకుండా ఇలా పోలీస్‌స్టేషన్‌లో ఫోర్జరీ కేసు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. దీనిపై న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఎన్నికల అఫిడవిట్లో కూడా భూమికి సంబంధిచిన వివరాలు ఇచ్చానని సంతోష్‌కుమార్ వెల్లడించారు. మరోవైపు ఎన్నికల వేళ ఇతర పార్టీల్లోకి బీఆర్ఎస్ నేతల వలసలు, మద్యం కేసులో కవిత అరెస్ట్‌తో (MLC Kavitha Arrest) పాటు తాజాగా కేటీఆర్‌పై కేసులు గులాబీ పార్టీ నాయకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ - నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల కేసు - పోలీసుల అదుపులో హరీశ్‌రావు మాజీ సిబ్బంది - TS CMRF CHEQUES SCAM