ETV Bharat / state

కారు ప్రమాదంలో కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి - దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

Cantonment MLA Lasya Nanditha Passed Away : సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు వెంటాడింది. పది రోజుల క్రితం నల్గొండ జిల్లా చర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తృటిలో మృత్యువు నుంచి బయటపడిన ఆమె, నేడు పటాన్​చెరు ఓఆర్​ఆర్​పై జరిగిన యాక్సిడెంట్​లో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారు వేగంగా వెళ్లి రెయిలింగ్​ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

MLA Lasya Nanditha Passed Away
MLA Lasya Nanditha Passed Away
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 7:15 AM IST

Updated : Feb 23, 2024, 1:04 PM IST

Cantonment MLA Lasya Nanditha Passed Away : సంగారెడ్డి జిల్లాలోని పటాన్​చెరు ఓఆర్​ఆర్​పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నందిత, కారులో పీయూష్​ అనే వ్యక్తితో కలిసి ప్రయాణిస్తుండగా రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్​ను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

మొదటగా కారు ముందు నుంచి వెళుతున్న టిప్పర్​ లేదా లారీని వెనక నుంచి ఢీకొట్టి, అదుపుతప్పి డివైడర్​ను కొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం దాటికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందువైపు ఉన్న ఎడమ చక్రం విడిపోయింది. ముందుభాగం పూర్తిగా రూపురేఖలు లేకుండా పోయిందని పోలీసులు పేర్కొన్నారు. దీని ప్రకారం కారు బలంగా భారీ వాహనాన్ని ఢీకొన్న తర్వాతే, అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రెయిలింగ్​ను ఢీకొని ఉంటుందని అనుమానిస్తున్నారు.

MLA Lasya Nanditha Road Accident : ప్రమాదం జరిగిన తర్వాత ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య నందిత కుప్పకూలిపోయి ఉన్నట్లు అక్కడకు చేరుకున్న అంబులెన్స్​ సిబ్బంది తెలిపారు. తమకు సమాచారం అందిన వెంటనే ఉదయం 6.04 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలతో పడిపోయి ఉన్న లాస్య నందిత(MLA Lasya Road Accident)ను పటాన్​చెరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందితకు గాయాలు, ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డు మృతి

MLA Lasya Nanditha Died in Road Accident : ఈ ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి హరీశ్​రావు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి, జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నందిత మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగిన కారును పటాన్​చెరు టోల్​గేట్​ వద్దకు పోలీసులు తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మురం చేశారు. ఆమె మృతి చెందడంతో కుటుంబసభ్యులు, కార్యకర్తల రోదనలు మిన్నంటాయి.

మృత్యువు నుంచి బయటపడినా : పది రోజుల క్రితం నల్గొండలో బీఆర్​ఎస్(BRS Public Meeting)​ బహిరంగ సభకు హాజరై తిరిగి హైదరాబాద్​ వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురయ్యారు. నార్కట్​పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఎమ్మెల్యే కారును ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో లాస్య నందిత తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో కారులో ఆమెతో పాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్​మెన్​లు ఉన్నారు.

సరిగ్గా ఏడాది క్రితం తండ్రి మృతి : ఇదిలా ఉండగా లాస్య నందిత తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న సరిగ్గా ఏడాది క్రితం మృతి చెందారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన, కార్డియాక్‌ అరెస్ట్‌ రావడంతో ఫిబ్రవరి 19న కన్నుమూశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అధిష్ఠానం ఆయన స్థానంలో కుమార్తె లాస్య నందితకు టికెట్​ ఇవ్వగా, శాసనసభ్యురాలిగా ఘనవిజయం సాధించారు. ఇటీవల జరిగిన ఓ రోడ్డుప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడినా, ఈసారి పటాన్​చెరు ఓఆర్ఆర్ వద్ద జరిగిన యాక్సిడెంట్​లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Feb 23, 2024, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.