ETV Bharat / state

జాబ్ చేస్తూ బీఈడీ చదవాలనుకుంటున్నారా?- నిపుణులు ఏమంటున్నారంటే? - CAN I STUDY B ED WHILE WORKING

రైల్వే ఉద్యోగం చేస్తూ బీఈడీ చదవాలనుకుంటున్నారా - మరి కెరియర్ నిపుణులు ప్రొఫెసర్ రాజశేఖర్ ఏమంటున్నారంటే?

Education News Today
Education News Today (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2024, 11:00 AM IST

Experts Advice On Studying B.Ed. While Working : సాధారణంగా ఉన్నత చదువులు చదవాలనుకుని స్తోమత సరిపోకనో, కుటుంబ సమస్యల వల్లనో చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరిపోతుంటారు. మరికొందరేమో మంచి ఉద్యోగం చేస్తున్నా, తమకు నచ్చిన కోర్సు చేయాలనో, నచ్చిన డిగ్రీ చదవాలనో అనుకుంటారు. కానీ చేస్తున్న ఉద్యోగం వదిలి చదవుకే పూర్తి సమయం కేటాయించాలంటే ఇళ్లెలా గడుస్తుందోనని భయపడుతుంటారు.

అయితే కొందరు మాత్రం ఓవైపు ఉద్యోగం చేస్తూ వెసులుబాటు కల్పించుకుని మరీ తమకు నచ్చిన కోర్సు చదువుకుంటూ ఉంటారు. అలా రైల్వేలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా వేరే డిగ్రీ చదువుకోవచ్చా? అది కూడా వారానికి రెండు నైట్ డ్యూటీలు చేస్తూ.. మిగతా రోజుల్లో కాలేజీకి వెళ్తూ రెగ్యులర్ బీఈడీ చేయొచ్చా? ఇది కుదురుంతా? దీనికి రైల్వే శాఖ ఒప్పుకుంటుందా? కెరియర్‌ కౌన్సెలర్‌ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ ఏమంటున్నారో ఓసారి చూద్దామా?

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రెగ్యులర్​ పద్ధతిలో ఏ డిగ్రీ ప్రొగ్రామూ చదవడానికి వీలులేదని కెరియర్ కౌన్సెలర్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ అంటున్నారు. రోజూ నైట్​ డ్యూటీలు ఉన్నాసరే రెగ్యులర్​ పద్ధతిలో బీఈడీ చదవడానికి అసలు కుదరదని చెబుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ టైంలోనే కాకుండా 24 గంటలూ ఉద్యోగంలోనే ఉన్నట్లు లెక్క అని తెలిపారు. ఉద్యోగం చేసే సంస్థ ముందస్తు అనుమతితో మాత్రమే డిగ్రీ/ ఆన్​లైన్​ / ఈవినింగ్​ కళాశాలు / డిప్లొమా దూరవిద్య చదవొవచ్చని చెప్పారు.

"ఉద్యోగాల భర్తీ సమయంలో ఉద్యోగం చేస్తూ చదివిన వారికి నియామకాలను పెండింగ్​లో పెట్టారు. కొన్ని ప్రభుత్వ నియామకాల సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఉద్యోగాలకు సెలవు పెట్టకుండా రెగ్యులర్​గా డిగ్రీలు పొందిన వారి నియామకాలను పెండింగులో పెట్టారు. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదంటే రెండేళ్లు సెలవు పెట్టి బీఈడీ ప్రోగ్రామ్​ను రెగ్యులర్​గా చేయడం మేలు." అని ప్రొఫెసర్ సూచిస్తున్నారు.

ఈ ప్రశ్నలు వేసుకోండి : బీఈడీ చదివే క్రమంలో ప్రస్తుత ఉద్యోగ విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతాయా అనే అంశాలపై లోతుగా చర్చించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బీఎస్సీ డిగ్రీ చదివి మాత్రమే బీఈడీని దూరవిద్య ద్వారా చేయడం కుదరదని.. కేవలం డీఈడీ విద్యార్హతతో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు మాత్రమే ఓపెన్​ యూనివర్సిటీల ద్వారా లేదా ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో దూరవిద్య ద్వారా బీఈడీ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఆసక్తి ఉంటే డిగ్రీ విద్యార్హతతో డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్ ఓపెన్​ యూనివర్సిటీ నుంచి స్పెషల్​ ఎడ్యుకేషన్​లో బీఈడీ చదవొచ్చని ప్రొఫెసర్ రాజశేఖర్ సూచించారు. ఈ స్పెషల్​ ఎడ్యుకేషన్​లో బీఈడీ కోసం డీఈడీ విద్యార్హత, ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం వంటి నిబంధనలు ఏమీ ఉండవని తెలిపారు. ఈ బీఈడీ స్పెషల్​ ఎడ్యుకేషన్​తో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులకు ప్రయత్నం చేయవచ్చుని.. ఉపాధ్యాయ వృత్తి కోసమే కాకుండా ఎడ్యుకేషన్​ సబ్జెక్టుపై ఆసక్తి ఉంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్​ యూనివర్సిటీ ద్వారా ఎంఏ ఎడ్యుకేషన్​ను చేయండని సూచనలు చేశారు. బీఎడ్​ లాంటి ప్రొఫెషనల్​ ప్రోగ్రామ్స్​ను రెగ్యులర్​గా చదివితేనే వృత్తికి అవసరమైన నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, మెలకువలు సాధించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

ఫారిన్​లో హయ్యర్ స్టడీస్​ చేయాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Abroad Higher Education Guide

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.