ETV Bharat / state

రూ.33 వేల కోట్లతో అమరావతిలో నిర్మాణాలకు పచ్చజెండా - CABINET NOD FOR AMARAVATI WORKS

వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జేఈఈ, నీట్‌ శిక్షణ-మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

cabinet_nod_for_rs33000_crore_amaravati_works
cabinet_nod_for_rs33000_crore_amaravati_works (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Cabinet NOD For rs33000 Crore Amaravati Works : రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.33,137.98 కోట్లతో 45 ఇంజినీరింగ్‌ పనుల్ని చేపట్టేందుకు సీఆర్‌డీఏకి అనుమతిచ్చింది. ఐఏఎస్, గెజిటెడ్‌ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల క్వార్టర్లు, వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకర్లకు వివరించారు. రాజధాని అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఇందుకోసం హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు రుణాలు తీసుకోవడానికి సీఆర్‌డీఏకి ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు.

44,195 జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు మళ్లీ టెండర్లు : వైఎస్సార్సీపీ ప్రభుత్వ చేతగానితనంతో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో తెలిపేందుకు జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) ఒక ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షల మంది ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు జల్‌జీవన్‌ మిషన్‌ కింద 77,917 పనుల్ని చేపట్టేందుకు రూ.26,824 కోట్లు మంజూరు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం రూ.4 వేల కోట్లే ఖర్చు చేసింది.

ఈ పథకం కింద గతంలో రూ.11,400 కోట్లతో మంజూరై ఇప్పటికీ పనులు ప్రారంభించని, 25% కంటే తక్కువ జరిగిన 44,195 పనుల్ని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వివిధ దశల్లో ఉన్న 33,717 ప్రాజెక్టుల్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ఇతర పనులన్నింటినీ పునఃపరిశీలించి ఈ ప్రాజెక్టులను తిరిగి డిజైన్‌ చేయాలని

క్యాబినెట్‌ తీర్మానించింది. జేజేఎం పునరుద్ధరణలో భాగంగా రూ.7,910 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 5 ఎంవీఎస్‌ పనులను రద్దు చేసి, నూతన డిజైన్లతో టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా డీపీఆర్‌ల తయారీకి అనుమతులు ఇచ్చేందుకు, అన్ని జేజేఎం పనుల పూర్తికి 6 నెలలపాటు గడువు పొడిగించే ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. క్యాబినెట్‌ తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇవీ.

విద్యార్థులకు పోటీపరీక్షల మెటీరియల్‌ : వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ కళాశాలల విద్యార్థులకు జేఈఈ, నీట్, ఈఏపీసెట్‌లపై శిక్షణ. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్‌. వీటిని బోధించేందుకు ప్రత్యేక సమయం కేటాయింపు.

  • పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించి పంపిణీ.
  • ప్రభుత్వ యాజమాన్యాల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.32.45 కోట్ల వ్యయంతో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, రికార్డ్‌ బుక్స్, రాతపుస్తకాలతో కిట్‌.
  • ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పునరుద్ధరణ. జనవరి నుంచి 475 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అమలు. అదే ప్రాంగణంలో కలిసి ఉన్న లేదా సమీపంలోని ఉన్నత పాఠశాలల నుంచే కళాశాల విద్యార్థులకూమధ్యాహ్న భోజనం.
  • కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేట్‌ చేస్తూ విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక రూపకల్పన.

ముంపు ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు : విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఈ ఏడాది ఆగస్టు 30 తర్వాత వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాల రీ-షెడ్యూలుకు అనుమతి. రూ.50 వేలలోపు మంజూరు చేసిన రుణాలపై స్టాంప్‌ డ్యూటీ, యూజర్‌ ఛార్జీల మినహాయింపు. కొత్త రుణాలు తీసుకునేందుకు చెల్లించాల్సిన స్టాంప్‌ డ్యూటీకీ మినహాయింపు. ఈ ఉత్తర్వులు 2025 మార్చి 31 వరకు అమలు.

ఇక జెట్ స్పీడ్​లో అమరావతి పనులు - రాజధానిలో మరో రూ.24,276 కోట్ల పనులకు ఆమోదం

సబ్‌డివిజన్‌కు ఫీజు మినహాయింపు

  • వైఎస్సార్సీపీ ప్రభుత్వం రీసర్వే చేసిన 6,688 గ్రామాల్లో సబ్‌ డివిజన్‌ కోసం 48,899 అర్జీలు వచ్చాయి. ఇలా సబ్‌ డివిజన్‌ చేసేందుకు ఒక్కోదానికి చెల్లించాల్సిన రూ.550 ఫీజుకు ఇప్పుడు మినహాయింపు.
  • గ్రామకంఠం భూముల సర్వే, రికార్డింగ్‌ కోసం సృష్టించిన 679 సూపర్‌ న్యూమరీ డిప్యూటీ తహశీల్దార్‌ (రీ-సర్వే) పోస్టులను 2026 సెప్టెంబరు 22 వరకు రెండేళ్లపాటు కొనసాగించేందుకు అనుమతి.
  • నిర్దేశిత షరతులతో రీసర్వే పూర్తికి నిర్ణయం. రీసర్వే ప్రాజెక్ట్‌ కింద మిగిలిన 10,128 గ్రామాల్లో రీసర్వే చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం.
  • మంగళగిరి ఎయిమ్స్‌కు మరో 10 ఎకరాల కేటాయింపు.
  • చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తిమ్మగానిపల్లెలో నూతన కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు 50.21 ఎకరాల్ని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీకి ఉచితంగా బదలాయింపునకు ఆమోదం.
  • ఈఎస్‌ఐ కోసం ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు కర్నూలు జిల్లా బి.తాండ్రపాడులోని 5 ఎకరాల్ని మార్కెట్‌ ధర ఎకరా రూ.61.23 లక్షల చొప్పున తీసుకుని బదలాయింపునకు ఆమోదం.
  • ఏపీ రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు 14 పోస్టుల మంజూరుకు ఆమోదం.
  • విభజన చట్టం ప్రకారం తెలంగాణకు బదలాయించిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (మార్కెటింగ్‌) జి.వి.రమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌లో 2026 జూన్‌ 30 వరకు కొనసాగేలా సూపర్‌ న్యూమరరీ పోస్టు సృష్టించేందుకు అనుమతి.

ఎన్టీపీసీ ఏర్పాటుతో ఆదాయం : క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ద్వారా ఎన్టీపీసీతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. రాష్ట్రంలో ఎన్టీపీసీ రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. దీనిద్వారా రాష్ట్రానికి రూ.20,620 కోట్ల ఆదాయం, 1.06 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ధాన్యం దిగుమతి చేయగానే సొమ్ము చెల్లింపు!

ధాన్యం సరఫరా చేసిన ఆరేడు గంటల్లోనే కొంతమంది రైతులకు ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తోంది. రైతులు పంపిన ధాన్యాన్ని రైస్‌మిల్లులో దిగుమతి చేసి, సంబంధిత రసీదు జనరేట్‌ కాగానే అక్కడికక్కడే చెల్లింపులు చేసే అవకాశాన్నీ పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఈ ఏడాది వరి సేకరణ కార్యకలాపాల కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ.1000 కోట్ల అదనపు రుణం పొందేందుకు ప్రభుత్వ హామీ పొడిగింపు.

2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ - స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.