ETV Bharat / state

కాళ్లూచేతులు కట్టేసి - బ్రిడ్జి మీద నుంచి నదిలో పడేసి - వాటా డబ్బులు అడిగినందుకు ఘాతుకం

కలిసి ప్రారంభించిన వ్యాపారంలో విభేదాలు - తప్పుకున్న భాగస్వామి - తన వాటా డబ్బులు ఇవ్వాలని అడగ్గా హత్య

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Businessman Killed For Money In Telangana
Businessman Killed For Money In Telangana (ETV Bharat)

Businessman Killed For Money In Telangana : వ్యాపారం నుంచి తప్పుకొన్న భాగస్వామి తన వాటా డబ్బులు తిరిగివ్వమని అడగ్గా కోపానికి గురై హత్య చేయించిన ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. షాపూర్‌నగర్‌లోని బాలానగర్‌ డీసీపీ కార్యాలయంలో ఇన్‌ఛార్జి డీసీపీ కోటిరెడ్డి సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన వెంకటప్పన్న రెడ్డి (54) రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి భార్య, ఇద్దరు కుమారులతో ఆల్విన్‌ కాలనీ ఈస్ట్‌ సాయినగర్‌లో ఉంటున్నారు. బాలానగర్‌లోని మేఘా సంస్థలో ఏజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 4న ఉద్యోగానికి వెళ్లిన వెంకటప్పన్న రెడ్డి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భార్య హేమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి, అతడి స్నేహితుడే ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

కుటుంబసభ్యుల ముందు నీలదీసినందుకు ఘాతుకం : ఏపీలోని అన్నమయ్య జిల్లా కలికిరి మండలానికి చెందిన బత్తిన ద్వారకానాథ్‌ రెడ్డి (48) వెంకటప్పన్న రెడ్డికి విశాఖపట్నంలో పరిచయమయ్యాడు. ఇద్దరూ 2021-22లో కాకినాడ పోర్టులో క్యాటరింగ్, క్లీనింగ్‌ సర్వీస్ బిజినెస్ మొదలుపెట్టారు. లావాదేవీల్లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వెంకటప్పన్న రెడ్డి వ్యాపారం నుంచి తప్పుకోవాలి అనుకున్నాడు. ఇందుకు భాగస్వామి వాటా డబ్బులు రూ.28 లక్షలు చెల్లించేందుకు ద్వారకానాథ్‌ రెడ్డి ఒప్పుకున్నాడు. నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో ఇటీవల ద్వారకానాథ్‌రెడ్డి ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యుల ముందు తన డబ్బులివ్వాలని వెంకటప్పన్న రెడ్డి నిలదీశాడు. అందరి ముందు నిలదీయడంతో పరువు పోయిందని భావించిన ద్వారకానాథ్‌రెడ్డి స్నేహితుడిని హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.

ఆస్తి కోసం అత్తతో కలిసి మామను చంపిన అల్లుడు - సహజ మరణంగా అందరినీ నమ్మించి, ఇలా దొరికిపోయారు - Man killed Father in law

అపహరించి : తెలిసిన వారి సాయంతో వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె మండలానికి చెందిన సుధాకర్‌ రెడ్డికి విషయం చెప్పాడు. అదే ప్రాంతానికి చెందిన పాశం ప్రసాద్‌, బుసుపాటి కిరణ్‌కుమార్‌, గడ్డం వెంకట సుబ్బయ్య, అన్నిక మణికంఠలకు రూ.10 వేల చొప్పున డబ్బులు ఇచ్చి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు ఈ నెల 4న బైక్​పై ఇంటికి వెళుతున్న వెంకటప్పన్నరెడ్డిని కూకట్‌పల్లి మైత్రీనగర్‌ వద్ద అడ్డుకుని క్లోరోఫాం చల్లి అపస్మారక స్థితిలోకి చేరిన తర్వాత కారులో జోగులాంబ గద్వాల జిల్లా కొత్తకోట తీసుకెళ్లారు.

అక్కడ అతని కాళ్లు, చేతులు కట్టేసి బీచుపల్లి బ్రిడ్జి మీద నుంచి కృష్ణానదిలో పడేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా జల్లెడపట్టి నిందితుల ఆచూకీని కనిపెట్టారు. పడేసిన చోటు నుంచి 15 కి.మీ. దూరంలో మృతదేహాన్ని గుర్తించారు.

మహిళను హత్య చేసి - మర్డర్​ను రేప్​ సీన్​గా మార్చి - కటకటాల్లోకి కి'లేడీ' - Kukatpally Murder Case

ప్రేమించలేదని స్నేహితుడే చంపేశాడు - మియాపూర్‌ మర్డర్‌ కేసులో కొత్త ట్విస్ట్ - Miyapur software Engineer Murder

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.